పుష్ప 2: సుక్కు సార్.. వేస్టేజ్ వద్దు?

Update: 2022-09-24 00:30 GMT
పుష్ప మొదటి భాగం సక్సెస్ కావడంతో డైరెక్టర్ సుకుమార్ కు ఇప్పుడు మరింత బలం వచ్చింది అని చెప్పవచ్చు మొదటినుంచి కూడా భారీ బడ్జెట్ సినిమాలను తెరపైకి తీసుకు వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈసారి ఖర్చు విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా భారీగానే ఖర్చు పెట్టబోతోంది. సెకండ్ పార్ట్ కు సంబంధించిన బడ్జెట్ లెక్కలు బయటకు రాకముందే అప్పుడే ఫ్రీ రిలీజ్ లెక్కలకు సంబంధించిన అంశాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ఒక విధంగా అది నిజమే కావచ్చు. ఎందుకంటే పుష్ప ఫస్ట్ పార్ట్ సక్సెస్ కావడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ బిజినెస్ విషయంలో మాత్రం నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ఆ సినిమా బిజినెస్ 600 కోట్ల నుంచి 700 కోట్ల మధ్యలో ఉండవచ్చు అని కూడా టాక్ వచ్చింది. అయితే ఏదేమైనా కూడా దర్శకుడు సుకుమార్ ఈసారి అనవసరంగా డబ్బు అలాగే సమయం వృధా చేయకుండా ఉంటే బెటర్ అని కామెంట్స్ వస్తున్నాయి.

సుకుమార్ మొదటి సినిమా తప్పితే ఆ తర్వాత చేసిన చాలా సినిమాలకు కూడా చాలా సన్నివేశాలను ఎడిటింగ్ లో తీసేయాల్సి వచ్చింది. ముఖ్యంగా నాన్నకు ప్రేమతో అయితే దాదాపు 40 నిమిషాల నుంచి గంట మధ్యలో సన్నివేశాలను తీసేసారట. అయితే ఆ విషయంలో సుకుమారు ఒక క్లారిటీ కూడా ఇచ్చాడు. హాలీవుడ్లో సైతం కొన్ని సినిమాలకు అవసరం అనుకున్న ప్రతి సన్నివేశాన్ని కూడా షూట్ చేసి ఆ తర్వాత ఎడిటింగ్ లో అవసరం అయితే వాటిని పెట్టుకుంటారు లేదంటే తీసేస్తారు అని అన్నారు.

ఏదైనా ఉంటే ఎడిటింగ్ లో చూసుకోవచ్చు అని ముందుగానే ఇది అవసరం ఉంటుందేమో అని కొన్ని సన్నివేశాలను రెడీ చేసుకోవడం బెటర్ అని చెప్పాడు. అయితే పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ తీసినప్పుడే దాదాపు సెకండ్ పార్ట్ కు సంబంధించిన 70% కు పైగా షూటింగ్ పూర్తయిందని అప్పట్లో చెప్పారు. కానీ ఆ సినిమా సక్సెస్ తరువాత మళ్ళీ పూర్తిస్థాయిలో స్క్రిప్టు మొత్తం మార్చేశారు అంటే ఎంత నిడివి ఉండవచ్చో అర్థం చేసుకోవచ్చు.

అందులో సీన్స్ మళ్ళీ సెకండ్ పార్ట్ లో యూజ్ చేసేది తక్కువే అనిపిస్తోంది. అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ కు సంబంధించి మాత్రం సుకుమార్ మరిన్ని జాగ్రత్తలతో మరింత సమయం డబ్బు వృధా చేయకుండా బౌండెంట్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈసారైనా రన్ టైమ్ కు తగ్గట్టుగా వేస్టేజ్ లేకుండా సుక్కు సార్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాడో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News