ఎంక‌న్న సామి క‌న్నెర్ర‌జేశాడా సుక్కూ?

Update: 2019-11-17 10:25 GMT
శేషాచ‌లం కొండ‌ల్లో ఏం చేయాల‌న్నా ఒక‌రి అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. ఆయ‌న చ‌ల్ల‌ని చూపు లేనిదే అక్క‌డ ఎవ‌రూ ఏదీ చేయ‌లేరు. ప్ర‌పంచంలోనే మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ గాడ్ వెంక‌న్న సామి ఆజ్ఞ లేనిదే ఎవ‌రు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఏదీ జ‌ర‌గ‌దు. ఏడు కొండ‌లు ఎక్కే భాగ్యం ద‌క్కాల‌న్నా భ‌క్తుల‌కు ఆయ‌న‌ అనుమ‌తి కావాలి. తిరుమ‌లేశుని సంద‌ర్శ‌నం అన్న‌ది కూడా దైవాజ్ఞ అని భ‌క్తులు చెబుతుంటారు. అంత‌టి మ‌హ‌త్యం ఉన్న స్వామి వారి పాదాల చెంత అడ‌వుల్లో షూటింగు కోసం ప్ర‌య‌త్నిస్తున్న అల్లూ వార‌బ్బాయ్ బ‌న్నికి.. డైరెక్ట‌ర్ సుకుమార్ కి ఎంక‌న్న సామి అనుమ‌తి ల‌భించిన‌ట్టేనా? అంటూ ఊహూ! అనే త‌ల అడ్డంగా తిప్పేస్తున్నారు. అస‌లింత‌కీ ఏమైంది? అంటే...

అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం చిత్తూరు నేప‌థ్యంలో తిరుప‌తి ప‌రిస‌రాల్లోని కొన్ని అరుదైన లొకేష‌న్ల‌లో షూటింగ్ చేయాల‌నుకుంటున్నారు. ముఖ్యంగా ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల బ్యాక్ డ్రాప్ క‌థాంశం కావ‌డంతో శేషా చ‌లం అడ‌వుల్ని జ‌ల్లెడ ప‌ట్టారు. కొన్ని వేల ఎక‌రాల్లో విస్తారంగా ఉన్న ఈ కార‌డ‌వుల్లో షూటింగ్ కోసం సుక్కూ నానా ప్ర‌యాస‌లు ప‌డుతున్నాడ‌ట‌. ఒరిజినాలిటీ అన్న‌ది చెడ‌కుండా క‌థ‌లో ఫ్లేవ‌ర్ కి త‌గ్గ‌ట్టు ద‌ట్ట‌మైన అడ‌వుల్లో చిత్రీక‌రించాల్సిన చిత్ర‌మిది. దీంతో అడ‌వులు కొండ‌లు లోయ‌లు దాటుకుని వెళ్లి లొకేష‌న్లు చూశార‌ట‌. ముఖ్యంగా ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ చేసే కొండ‌ల్లోనే తెర‌కెక్కించాల‌న్న‌ది ప్లాన్. త‌మిళ‌నాడు.. ఆంధ్ర బార్డ‌ర్.. క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు ప్రాంతం కీకార‌ణ్యం సుక్కూ కంట్లో ప‌డింద‌ట‌.

అంతా బాగానే ఉంది .. అక్క‌డ షూటింగ్ చేయ‌డానికి ఏమిటి ఇబ్బంది అంటే .. అక్క‌డే తిర‌కాసు ఉంది. ఇక్క‌డ షూటింగుకి ఎంక‌న్న సామి ప‌ర్మిష‌న్ ల‌భించ‌డం లేద‌ట‌. అంటే అధికారులు అనుమ‌తి ఇవ్వ‌నిదే ఆ ఏరియాలో అడుగు పెట్టేందుకు లేనేలేదు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ అడ‌వుల్లో పులులు సింహాల‌దే రాజ్యం. అలాంటి చోట షూటింగుల‌కు అనుమ‌తులు అంటే అధికారులు విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అందుకే అనుమ‌తి కుద‌ర‌ద‌ని చెప్పేశార‌ట‌. దీంతో ఇక చేసేదేమీ లేక అన్ని అనుమ‌తులు ఫ్రీగా ఇచ్చేసే బ్యాంకాక్ కి షూటింగ్ ను షిఫ్ట్ చేశార‌ని వినిపిస్తోంది. బ్యాంకాక్ అడ‌వుల్నే శేషాచ‌లం అడ‌వులుగా భావించి షూటింగ్ చేసేస్తారు. ఇక వాటినే తెలుగు ఆడియన్ కూడా శేషాచ‌లం కార‌డ‌వులు అని భావించాల్సి ఉంటుంద‌ట‌. ఒరిజినాలిటీ చెడ‌కూడ‌ద‌నుకున్న సుక్కూకి చివ‌రినిమిషంలో ఎంక‌న్న సామి ట్విస్టు ఏమిటో!! చిత్తూరు షెడ్యూల్ ప్ర‌స్తుతం విదేశాల్లో చేయాల్సి వ‌స్తోంది.
Tags:    

Similar News