సుక్కూ కామెంట్లు తన సినిమా గురించేనా?

Update: 2016-12-05 04:48 GMT
''రామ్ చరణ్‌ వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా చెప్పుకోవాల్సిందే. తను ఏ చిన్న ప్రామిస్ చేసినా కూడా వదిలేయడు. ఒక చిన్న పెన్ మనం నచ్చింది అని చెప్పినా కూడా అది మర్చపోడు. మనం ఇంటికెళ్లే సరికి ఆ పెన్ అక్కడ ఉంటుంది. అంత మంచి వ్యక్తిత్వం ఉంది చరణ్‌ దగ్గర'' అంటూ కాస్త ఎమోషనల్ గా చెప్పాడు సుకుమార్. ''ధృవ'' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ కామెంట్లు విన్న ఎవరైనా కూడా వెంటనే ఒక విషయానికి కనక్ట్ అయిపోతున్నారు. అదేంటో తెలుసా?

నిజానికి సుకుమార్ తో ఒక సినిమా చేస్తానని రామ్ చరణ్‌ ప్రామిస్ చేశాడట. కథ కథనం సబ్జెక్ట్ బడ్జెట్ ఏవైనా కూడా సుక్కూ చెప్పినట్లే చేద్దాం అన్నాడట. అయితే 'నాన్నకు ప్రేమతో' సినిమా హిట్టు టాక్ తెచ్చుకున్నప్పటికీ బడ్జెట్ పరంగా నిర్మాతలకు వర్కవుట్ కాకపోవడంతో.. పెద్ద నిర్మాతలెవ్వరూ సుక్కూతో డేర్ చేయలేకపోతున్నారు. హీరోలు కూడా అంతే. ఈ తరుణంలో చరణ్‌ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుని సుకుమార్ తో తన తదుపరి సినిమా చేయడానికి రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. అది మైండ్లో పెట్టుకునే ఇప్పుడే సుక్కూ ఇలా చెప్పుకొచ్చాడా అని అనిపిస్తోంది కదూ? అవును అలాగే అనిపిస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్‌ ఒక చెవిటి వాడిగా నటిస్తున్నాడని.. చాలా అగ్రెసివ్ గా ఉండే ఒక కారెక్టర్ అంటూ ఒక రూమర్ షికారు చేస్తుండగా.. ఈ సినిమా ఒక పీరియడ్ ఫిలిం అని.. ఇందులో భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు జరిగే ఒక కథను చెబుతున్నారని మరో రూమర్ వినిపిస్తోంది. ఏది నిజమో త్వరలోనే తెలుస్తుందిలే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News