ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా 'పుష్ప' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాలో పాత్రల లుక్ డిఫరెంట్ గా ఉన్నప్పటికీ, వాటి నుంచి ఆశించిన స్థాయిలో అవుట్ పుట్ లేదనే టాక్ తొలి రోజునే వచ్చింది. దాంతో వసూళ్లపై ఆ టాక్ బాగానే ప్రభావం చూపిస్తుందని అంతా అనుకున్నారు. ఎవరికి ఏమనిపించింది అనేది కాదు, మనకి ఏమనిపిస్తుందో చూద్దాం అన్నట్టుగా అందరూ ఈ సినిమాకి వెళుతున్నారు. దాంతో ఈ సినిమా పంతం పట్టినట్టుగా పాత రికార్డులను పడగొడుతోంది.
ఇక అడవి నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అడవిలోనుంచి సాగే అక్రమ రవాణాకు సంబంధించిన కథలు కూడా వచ్చాయి. అయితే తెలుగులో ఈ కథాంశం ఈ స్థాయిలో రావడం మాత్రం ఇదే మొదలు. ఇక ఈ సినిమాలో ముందుగా అందరినీ ఆకట్టుకునేది 'పుష్ప' లుక్ .. ఆయన యాటిట్యూడ్. 'ఈ పాత్రని ఇలా డిజైన్ చేయాలనే ఆలోచన సుకుమార్ కి భలేగా వచ్చిందే' అని అంతా అనుకున్నారు. ఆ యాటిట్యూడ్ తన మూడో అన్నయ్య విజయ్ దేననీ, అలాంటి ఒక యాటిట్యూడ్ చుట్టూ కథను అల్లుకునేలా చేసింది ఆయనేనని సుకుమార్ చెప్పాడు.
ఈ విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ .. "మా మూడో అన్నయ్య విజయ్ ఒక రైస్ మిల్లులో పనిచేసేవాడు. అప్పటికే ఆయన చాలా రకాల వ్యాపారాలు చేసి దెబ్బతిన్నాడు. కుటుంబ బాధ్యతలను మోయడం కోసం ఆయనకి రైస్ మిల్లులో పనిచేయక తప్పలేదు. ఒకసారి రైస్ మిల్లులో పని అయిపోయిన తరువాత బయట కూర్చుని కాలుమీద కాలు వేసుకుని టీ తాగుతూ ఉండగా, అక్కడికి సూపర్ వైజర్ వచ్చాడు. తన ముందు కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటావా"? అంటూ ఆయన రుసరుసలాడిపోయాడు. "ఈ కాలు నాదే .. ఆ కాలు నాదే .. నా కాలు మీద నేను కాలు వేసుకుంటే నీకేంటి నొప్పి ?" అని మా అన్నయ్య అన్నాడు.
ఆయనలా అనడం .. ఆ యాటిట్యుడ్ నాకు నచ్చాయి. ఇలాంటి ఒక పాత్ర చుట్టూ అందుకు తగిన కథను అల్లుకుంటే బాగుంటుందే అని అప్పుడే అనిపించింది .. అది ఇన్నాళ్లకు కుదిరింది. ఈ ఒక్క విషయంలోనే కాదు .. ఇలా అనేక రకాల విషయాల్లో మా అన్నయ్య నాకు స్ఫూర్తిగా నిలిచాడు. జీవితంలో ఎన్నో సందర్భాల్లో నాకు అండగా నిలిచాడు" అని సుకుమార్ చెప్పుకొచ్చాడు. దర్శకులు తమ చుట్టూ ఉన్న మనుషుల నుంచే మేనరిజమ్స్ తీస్తూ ఉంటారు .. తమ పరిసరాలలో నుంచే కథలను రాబడుతూ ఉంటారు అనే విషయాన్ని సుకుమార్ మరోసారి నిరూపించాడు. ఇక ఈ సినిమా రెండవ పార్టు షూటింగు ఫిబ్రవరిలో మొదలుకానుంది.