స్టార్ యాంకర్ సుమకు ప్రతీ తెలుగు ఇంట అభిమానులు ఉంటారు. తన చతురతతో విపరీతంగా ఆకట్టుకుని.. అటు టీవీ షోలలో యాంకరింగ్ నుంచి.. సినిమా కార్యక్రమాలలో వ్యాఖ్యానం వరకూ.. ఎలాంటి ప్రోగ్రామ్ కు అయినా స్పెషల్ అట్రాక్షన్ అయిపోతుంది. ఇంతగా తెలుగు జనాలను మెప్పించిన ఈ స్టార్ మహిళ.. అసలు తెలుగు మహిళ కాదు అంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఈమె ప్రతిభకు గుర్తింపుగా.. తాజాగా జరిగిన టీవీ9 టివి అవార్డుల వేడుకలలో టెలివిజన్ ఎక్సెలెన్స్ అవార్డ్ ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఆడియో విజువల్ లో.. సుమ జీవిత ప్రయాణాన్ని చూపించారు. ఆ తర్వాత సుబ్బిరామిరెడ్డి చేతుల మీదుగా అవార్డ్ అందుకున్న సుమ.. తాను పెళ్లి చూపులు సీరియల్ తో సీరియల్ నటిని అయ్యానని.. అప్పుడు వయసు ఎంతో ఊహించుకోవాలని.. ఇప్పటికి 26 ఏళ్లుగా తన కెరీర్ కంటిన్యూ చేస్తానని.. తద్వారా ఇప్పుడు తన వయసు ఎంతో ఊహించుకోవాలని చెప్పి నవ్వించింది.
ఈ సమయంలో ఎంతో మంది టీవీ నుంచి సినిమాలకు వెళ్లగా.. చిరంజీవి.. నాగార్జున.. ఎన్టీఆర్ వంటి స్టార్లు బుల్లితెర యాంకర్లుగా మారడాన్ని చూశానని చెప్పింది. పెళ్లి చూపులు సీరియల్ ద్వారా కాకుండా.. పాడుతా తీయగా ప్రోగ్రామ్ తో తాను ఇంట్రడ్యూస్ అయిఉంటే.. గాయకురాలు అయ్యేదాన్నని.. ఆలీ గారితో కలిసి అందరితో పాటు తమకు కూడా గాయాలు చేసుకునేవాళ్లమని చమత్కరించింది.
తన తల్లి తెలుగు నేర్పించిందని.. అలా నేర్పిస్తున్న సమయంలో తెలుగు భాష నేర్పుతున్నానని అనుకుంది కానీ.. అదే తనకు అన్నం పెడుతుందని ఆమె కూడా ఊహించలేదని చెప్పింది సుమ. ఇక ప్రతీ ఇంటిలోను తమ పిల్లలకు తల్లిదండ్రులు మరో భాషను నేర్పడాన్ని అలవరుచుకోవాలని ఓ సలహా కూడా ఇచ్చింది ఈ స్టార్ యాంకర్.