ఇటీవల సావిత్రి ఆడియో ఫంక్షన్ సందర్భంగా ప్రముఖు నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటం.. ఈ అంశంపై బాలయ్య రియాక్ట్ అయి సారీ చెప్పటం తెలిసిందే. మహిళల్ని కించపరిచే ఉద్దేశంతో తాను మాట్లాడలేదని చెప్పిన బాలకృష్ణ.. బయటే కాదు అసెంబ్లీలోనూ వివరణ ఇచ్చారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తాజాగా నాటి హీరో.. నేటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుమన్ స్పందించారు. బాలయ్యకు మద్దతుగా నిలిచిన ఆయన.. క్షమాపణలు చెప్పిన తర్వాత ఆయన వ్యాఖ్యల్ని రాజకీయం చేయటం సరికాదన్నారు.
ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉండే బాలకృష్ణ.. ఏదో సరదాగా చేసిన వ్యాఖ్యలే కానీ.. మరొకటి కాదన్నారు. సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్లు ఉంటాయో చెప్పే క్రమంలోనే బాలయ్య అలా మాట్లాడారే తప్పించి.. మహిళల్ని కించపర్చటం ఆయన ఉద్దేశం కాదన్నారు. బాలయ్యతో నటించే మహిళా నటీమణులందరికి ఆయన గురించి తెలుసని.. వారిపట్ల ఆయనెంత మర్యాదగా ఉంటారో అందరికి తెలిసిన విషయమేనని సుమన్ చెప్పుకొచ్చారు. విశాఖకు వచ్చిన సందర్భంగా మాట్లాడిన సుమన్.. తన తాజా వ్యాఖ్యలతో బాలయ్యకు పూర్తి మద్దతు ఇస్తూ మాట్లాడారు.