ప్రస్తుతం టాలీవుడ్ ని డ్రగ్స్ విచారణ కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా డ్రగ్స్ డీల్స్ లో సంబంధాలు ఉన్న ప్రముఖ సెలబ్రిటీలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. అయితే దీనిపై సీనియర్ నటుడు సుమన్ ని మీడియా ప్రశ్నించగా ఆయన స్పందన ఆసక్తికరంగా మారింది.
డ్రగ్స్ లో సినిమా వోళ్లేనా అందరూ ఉన్నారు. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ఇది తగ్గాలంటే భారతదేశంలో కఠిన చట్టాలను తేవాల్సిన అవసరం ఉంది. సింగపూర్ మలేషియా సహా అన్నిచోట్లా డ్రగ్స్ ఉంది. కానీ అక్కడ కఠిన చట్టాలతో కంట్రోల్ చేస్తున్నారు. కానీ భారతదేశంలో అది లేదు.
ఇక్కడ కఠిన చట్టాలు అమలైతే డ్రగ్స్ తో పాటు రేప్ లు వగైరా కూడా ఆగిపోతాయి. చట్టాలు కఠినంగా లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని సుమన్ అన్నారు.