ఫారిన్ పోరితో అక్కినేని హీరో చక్కర్లు

Update: 2017-05-01 16:31 GMT
అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో సుమంత్. గతేడాది నరుడా డోనరుడా అంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కానీ సక్సెస్ మాత్రం టేస్ట్ చేయలేకపోయాడు. ఇప్పుడీ హీరో ఓ ఫారిన్ భామతో ప్రేమలో పడ్డాడనే టాక్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

కొన్ని కాలం క్రితం ఓ విదేశీ భామతో సుమంత్ ఓ రెస్టారెంట్ లో కనిపించాడు. అయితే.. వీరిద్దరూ తెగ సీరియస్ గా చర్చలు జరుపుతుండడంతో.. ఏదో కొత్త ప్రాజెక్ట్ గురించిన డిస్కషన్స్ అని అంతా భావించారు. దీంతో ఈ జంట సంగతిని పెద్దగా పట్టించుకోలేదెవరూ. కానీ ఆశ్చర్యకరంగా అదే భామతో కొన్ని రోజుల క్రితం ఐపీఎల్ మ్యాచ్ కు హాజరయ్యాడు సుమంత్. సన్ రైజర్స్ టీంకు సపోర్ట్ చేస్తూ ఇద్దరూ బాగానే హంగామా చేశారు. ఆ మ్యాచ్ లో వీరిద్దరి కలుగుపుగోలుతనం చూసిన వారికి.. వీరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు తలెత్తడమే కాదు.. బలపడిపోయాయ్ కూడా.

ఇప్పుడు విదేశీ అందగత్తెతో సుమంత్ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడని.. అమ్మాయి సైడ్ నుంచి సేమ్ సిట్యుయేషన్ అని అంటున్నారు. గతంలో తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్న సుమంత్.. ఆ తర్వాత విడాకుల బాట పట్టాడు. అప్పటి నుంచి సింగిల్ గానే ఉన్న ఈ హీరో జీవితంలోకి కొత్తగా ఈ ఫారిన్ భామ ఎంటర్ అవుతోందనే టాక్ ఎక్కువగానే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News