అక్కినేని నాగేశ్వరరావు ముద్దుల మనవడిగా, నాగార్జున మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో సుమంత్. కెరీర్లో కొన్ని విజయాలు ఉన్నప్పటికీ స్టార్ హీరో లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. కానీ అప్పుడప్పుడూ ఇంట్రెస్టింగ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. తాజాగా సుమంత్ ఒక కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు.
క్లీన్ షేవ్ లో ఉన్న ఒక ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి "5 సంవత్సరాల తర్వాత క్లీన్ షేవ్. గడ్డం మీసం లేకుండా క్లీన్ షేవ్ లో ఎలా ఉంటానో దాదాపుగా మర్చిపోయాను.. రాబోయే తాజా చిత్రం కోసం కొత్త లుక్" అని ట్వీట్ చేశాడు. సినిమా పేరు చెప్పకపోయినా ఈ లుక్ మాత్రం 'ఎన్టీఆర్' కోసమే అయి ఉంటుందని ఫ్యాన్స్ - నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో నటించే సినిమా 'ఎన్టీఆర్'. ఈ సినిమాలో ఎన్టీఆర్ తరంలో మరో లెజెండరీ తెలుగు నటుడయిన అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో సుమంత్ నటిస్తున్నాడని ఇప్పటికే వెల్లడించారు. మరి ఆ పాత్ర కోసమే ఈ కొత్త లుక్ అయి ఉండొచ్చు.
ఫోటో చూస్తుంటే తాతగారి పాత్రకు సుమంత్ న్యాయం చేస్తాడని అనిపిస్తోంది. సుమంత్ చిన్ననాటి నుండి తాతగారి వద్ద పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ తాతగారి పాత్ర ను పోషించడం ఒక అధ్బుతమైన అవకాశమే. మరి ఆ దసరాబుల్లోడిని ఈ నాగ్ మేనల్లుడు ఎలా కాపీ కొడతాడో వేచి చూడాలి.