ఏప్రిల్‌ లో చిన్న చిత్రాల పెద్ద వార్‌

Update: 2020-02-12 23:30 GMT
ఫిల్మ్‌ మేకర్స్‌ సంక్రాంతి సీజన్‌ తర్వాత అత్యంత ఆసక్తి చూపించే సీజన్‌ సమ్మర్‌ సీజన్‌. ఏప్రిల్‌.. మే రెండు నెలల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా కనీసం రెండు డజన్ల సినిమాలు విడుదల అవుతాయంటే ఆశ్చర్యం లేదు. సమ్మర్‌ హాలీడేస్‌ అవ్వడంతో సినిమాలు చూస్తారనే ఉద్దేశ్యంతో మేకర్స్‌ ఎక్కువగా సమ్మర్‌ ను టార్గెట్‌ చేస్తూ ఉంటారు. ఈసారి సమ్మర్‌ ను మీడియం రేంజ్‌ బడ్జెట్‌ చిత్రాలు మరింత హీట్‌ గా మారేలా చేస్తున్నాయి.

నాని విలన్‌ గా నటిస్తున్న 'వి' సినిమాతో సమ్మర్‌ సీజన్‌ ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత వారం అంటే ఏప్రిల్‌ 2.. 3వ తారీకుల్లో పలు చిత్రాలు రాబోతున్నాయి. ముఖ్యంగా 2వ తారీకున నాగచైతన్య లవ్‌ స్టోరీ.. రానా 'అరణ్య'.. మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ 'ఉప్పెన'.. స్వీటీ అనుష్క 'నిశబ్దం' చిత్రాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఈ నాలుగు సినిమాలు కూడా క్రేజీ ప్రాజెక్ట్స్‌ అవ్వడంతో ఒకే రోజు విడుదల అవ్వడంతో నలుగురికి కూడా నష్టమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు సినిమాల్లో రెండు సినిమాలను తదుపరి వారం లేదంటే ముందుకు డేట్‌ మార్చేలా చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. సమ్మర్‌ హాలీడేస్‌ ప్రారంభం అయ్యే వారం అవ్వడం వల్ల అంతా కూడా అదే రోజున రావాలని ఆశ పడుతున్నారు. కాని అది ఏంత మాత్రం శ్రేయష్కరం కాదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌ లో తదుపరి వారాల్లో కూడా పలు చిన్న చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

మొత్తానికి చిన్నా పెద్దా డబ్బింగ్‌ ఇలా అన్ని కలిసి 15 సినిమాల వరకు ఏప్రిల్‌ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్ద సినిమాలు లేకున్నా సమ్మర్‌ లో చిన్న చిత్రాలు ఆ లోటును భర్తీ చేస్తాయనే నమ్మకంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News