దాదాపు మూడేళ్లుగా కరోనా, ఒమిక్రాన్ ల కారణంగా భారీ చిత్రాల రిలీజ్ లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇటీవల పరిస్థితుల్లో మార్పులు రావడం.. తిరిగి జన జీవితం యదావిధిగా పట్టాలెక్కడంతో సినిమా థియేటర్లు దేశ వ్యాప్తంగా తెరుచుకున్నాయి. అన్ని రంగాల తరహాలోనే సినీ రంగంలోనూ క్రమ క్రమంగా సాధారణ పరిస్థితులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ కోసం ఎదురుచూసిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు రెడీ అయిపోయాయి.
మార్చి 11న ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` సినిమాతో పాన్ ఇండియా చిత్రాల పరంపర మొదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. తొలి రోజు నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుని ప్రభాస్ అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించింది. దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో అత్యథిక థియేటర్లలో ఈ మూవీ విడుదలైంది. ఆ తరువాత జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `ట్రిపుల్ ఆర్` మార్చి 25న భారీ అంచనాల మధ్య విడుదలైంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ కావడం, లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమురం భీం ల ఫిక్షనల్ స్టోరీ కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు అనుగుణంగా సినిమా వుండటంతో ప్రేక్షకుల వరల్డ్ వైడ్ గా ట్రిపుల్ ఆర్ కు బ్రహ్మరథం పట్టారు. ఇప్పడికే పలు రికార్డుల్ని తిరగరాసిన ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరి సంచలనాలు సృష్టిస్తోంది.
ఇక సినిమాల తరువాత బాక్సాఫీస్ మీద దాడికి మోన్‌స్టర్ లా `కేజీఎఫ్ చాప్టర్ 2`తో యష్ వచ్చేశాడు. ఏప్రిల్ 14న విడుడుదలైన ఈ మూవీ సమ్మర్ సందడిని గట్టిగాను మొదలుపెట్టింది. తొలి రోజే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని రాబట్టిన తొలి ఇండియన్ మూవీగా రికార్డులు బద్దలు కొట్టిన కేజీఎఫ్ ఫస్ట్ డే 132 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. వరుసగా ఈ మూవీస్ అందించిన జోష్ తో సమ్మర్ సమరానికి మరిన్ని చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఏప్రిల్ 29న మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన `ఆచార్య` రిలీజ్ కాబోతోంది.
కొరటాల శివ నుంచి దాదాపు నాలుగేళ్ల తరువాత వస్తున్న సినిమా ఇది. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి నుంచి రెండున్నరేళ్ల విరామం తరువాత రానున్న సినిమా కావడం, చరణ్, చిరు తొలిసారి కలిసి నటించిన మూవీ కావడంతో ఇప్పడికే ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ట్రిపుల్ అర్ తరువాత చరణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు, మెగా అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ మూవీ తరువాత మహేష్ నటించిన `సర్కారు వారి పాట` థియేటర్లలో సందడికి రెడీ అయిపోతోంది. మే 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.
`పోకిరి` వైబ్స్ కనిపిస్తున్నాయని హీరో మహేష్ స్వయంగా చెప్పడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రీతో పాటు 14 ప్లస్ రీల్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సహ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ బాటలోనే సమ్మర్ సోగ్గాళ్లుగా `ఎఫ్ 3` సినిమాతో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ వరుస చిత్రాలతో సమ్మర్ హంగామా ఓ రేంజ్ లో రసవత్తరంగా సాగబోతోంది.