ఓటీటీ వార్.. డిజిట‌ల్లో టేకోవ‌రా? ఇంట్రెస్టింగ్!!

Update: 2020-10-21 15:00 GMT
ఏదైనా భూమి త‌గాదాలో ఉంటే టేకోవ‌ర్ కామ‌న్. లేదా ఏదైనా బిజినెస్ ఫ‌ర్మ్ క‌ష్టాల్లో ఉన్నా లేదా లాభాల‌కు అమ్ముకోవాల‌న్నా టేకోవ‌ర్లు అక్విజిష‌న్లు స‌హ‌జ‌మే. అలాగే పంపిణీదారుల మ‌ధ్య పోటీలో కూడా సినిమాల అమ్మ‌కాలు కొనుగోళ్లు టేకోవ‌ర్లు చూస్తుంటాం. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు ఓటీటీ వార్ లో కూడా ఈ టేకోవ‌ర్ అనేది మునుముందు ప్రాధాన్య‌త సంత‌రించుకునే వీలుందని ఊహిస్తున్నారు.

ఇప్ప‌టికే ఓటీటీల మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంది. ఏదైనా క్రేజీ సినిమాని కొనేందుకు ఓటీటీలు పోటీప‌డుతున్నాయి. భారీ మొత్తాల్ని చెల్లిస్తున్నాయి. అయితే ఒక‌సారి బిజినెస్ డీల్ జ‌రిగాక దానిని టేకోవ‌ర్ చేయ‌డం అన్న‌ది మాత్రం ఇంత‌వ‌ర‌కూ విన‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఒక ఓటీటీ వాళ్లు కొన్న మూవీని ఇంకో ఓటీటీ వాళ్లు గ్యాంబుల్ చేసేశార‌ట‌. విన‌డానికి వింత‌గా ఉన్నా ఇది నిజం. ఇంత‌కీ ఏ సినిమా అది? డీటెయిల్స్ ఏమిటి? అంటే..

తాజా స‌మాచారం ప్ర‌కారం.. భూమి అనే చిత్రాన్ని హాట్ స్టార్ నుంచి స‌న్ గ్రూప్ ఛేజిక్కించుకుంద‌ట‌. ఇదేమీ టేకోవ‌ర్ రేంజు డీల్ అని అనలేం కానీ ఇలాంటి వైఖ‌రి ఇదే తొలిసారి. ఒక సంస్థ డీల్ మాట్లాడుకుంటే ఇంకో సంస్థ ఫింగ‌రింగ్ అనేది మ‌రి విడ్డూర‌మే మ‌రి. కోలీవుడ్ లో జయం రవి హీరోగా తెరకెక్కిన ‘భూమి’ సినిమా విష‌యంలో ఇలా జ‌ర‌గ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఇక ఈ మూవీ డిజిటల్ ప్రిమియర్ కంటే ముందు టీవీల్లో రిలీజైపోతోంద‌ట‌. ఈ దీపావ‌ళికి స‌న్ టీవీలో టెలీకాస్ట్ కానుంద‌ని చెబుతున్నారు. ఇలా అయితే ఓటీటీలో రిలీజ్ చేసినా స‌న్ వాళ్ల‌కు క‌లిసొస్తుందా? అంటే దానికి ఆన్స‌ర్ ఆ కంపెనీనే చెప్పాల్సి ఉంది. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి ల‌క్ష్మ‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక భూమి చేతులు మార‌డానికి కార‌ణం అడ్వాన్సులు ఇవ్వ‌కుండా మాట‌లు సాగ‌డ‌మేన‌ని అంటున్నారు. నిర్మాత మంచి డీల్ వైపు మొగ్గు చూప‌డం వ‌ల్ల‌నే ఇది జ‌రిగింద‌ట‌.
Tags:    

Similar News