కుర్ర హీరోకి 12 కుట్లు పడ్డాయ్

Update: 2016-06-17 11:57 GMT
కుర్ర హీరోల్లో సందీప్ కిషన్ ఇప్పుడు మంచి కసితో పని చేసేస్తున్నాడు. తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం, తనలో స్టామినా కానీ, క్రేజ్ గానీ తగ్గలేదని నిరూపించడం కోసం..నానా తంటాలు పడుతున్నాడు. వరుసగా సినిమాలు ఫెయిల్ కావడంతో.. నెక్ట్స్ పిక్చర్ కోసం మనోడు ఎంత తాపత్రయ పడుతున్నాడంటే... యాక్సిడెంట్స్ ని కూడా ఏ మాత్రం కేర్ చేయడం లేదు.

ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో నక్షత్రం సినిమా చేస్తున్న సందీప్ కిషన్ హిట్ కోసం ఎంతటి కష్టానికైనా రెడీ అంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ లో భాగంగా ఓ యాక్సిడెంట్ జరిగింది. దీంతో ఈ కుర్ర హీరోకి 12 కుట్లు వేయించుకోవాల్సి వచ్చింది.'ఆ సమయంలో కెమేరా నా భుజానికి చాలా క్లోజ్ గా ఉంది. కరెక్ట్ గా నా తలకు తగలడంతో పెద్దదెబ్బే తగిలింది. రక్తం చాలా కారిపోవడంతో భయపడ్డా కూడా. మొత్తం యూనిట్ అంతా షాక్ తినేసి.. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు' అని చెప్పాడు సందీప్ కిషన్.

ఈ కుర్ర హీరోకి మొత్తం 12 కుట్లు పడ్డాయి. అది కూడా తలపైనే కావడం గమనించాలి. అయినా సరే.. ప్రస్తుతం బాగానే ఉన్నానని అంటున్నాడు. వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పినా.. మూడ్రోజులు చాలంటూ సోమవారం షూటింగ్ కి వెళ్లిపోతానంటున్నాడు సందీప్ కిషన్.
Tags:    

Similar News