ఒక ఫెయిల్యూర్ అందితే ఈ రోజులల్లో ఏ ఇండస్ట్రీ అయినా పట్టించుకోవడం మానేస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా స్టార్ హోదా లేని హీరోలు వరుస డిజాస్టర్స్ తో ఉంటే వారితో సినిమా చేయడానికి ఇష్టపడరు. కానీ అదృష్టమో యాదృచ్చికమో తెలియదు గాని ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినప్పటికీ సందీప్ కిషన్ కి మాత్రం అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం కూడా కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు.
చివరగా తెలుగులో నక్షత్రం ద్వారా డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రాజెక్ట్ z అనే సినిమా తమిళ్ లో హిట్ అయినప్పటికీ తెలుగులో ప్రమోషన్స్ అలాగే డబ్బింగ్ పనులు సరిగ్గా జరగకపోవడంతో సినిమా రిలీజ్ కాలేదు కదా.. ఈ హీరోకు కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. అసలు సందీప్ వాయిస్ కాకుండా వేరొకరితో డబ్బింగ్ చెప్పించేసి ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేశాడు. ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టి సందీప్ ను బూతులు తిట్టాడు. దీంతో మరోసారి అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా సినిమాలను ఎంచుకుంటున్నాడట సందీప్ కిషన్. అలాగే ప్రస్తుతం కేవలం తెలుగు సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని చూస్తున్నాడు.
మంజుల దర్శకత్వంలో మనసుకు నచ్చింది సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మరికొన్ని రోజుల్లో రాబోతోంది. ఇక బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కునాల్ కోహ్లీ సినిమాను కూడా పూర్తిగా తెలుగులోనే తీయాలని సందీప్ అనుకుంటున్నాడట. ఆ తరువాత హిందీ - తమిళ్ లో రీమేక్ చేయాలనీ ఈ కుర్ర హీరో పక్కాగా ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సారైనా హిట్స్ అందుకుంటాడో లేదో చూడాలి.