ఈ పిల్ల‌కి సునీల్ ఫిట్‌ నెస్ టిప్స్ ఇస్తుండు!

Update: 2015-11-10 04:56 GMT
జిద్ మూవీతో బాలీవుడ్‌ లో వేడి సెగ‌లు పుట్టించింది మ‌న్నారా. ఆన్‌ స్ర్కీన్ ఈ అమ్మ‌డి ఎక్స్‌ పోజింగుకి యూత్ ఫిదా అయిపోయారు. జిద్ బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌ హిట్ కొట్ట‌డంలో మ‌న్నారా పాత్ర విస్మ‌రించ‌లేనిది. అందుకే ఈ అమ్మ‌డిని టాలీవుడ్ అక్కున చేర్చుకుంది. ఇక్క‌డ న‌టించిన ప్రేమా గీమా జాన్తా న‌య్‌.. అంత‌గా పేరు తేవక‌పోయినా జిద్‌ లో మ‌న్నారా పెర్ఫామెన్స్‌ కి మంచి మార్కులు ప‌డ్డాయి. ఆ సినిమా త‌న‌కి ఓ విజిటింగ్ కార్డ్‌ లా ఉప‌యోగ‌ప‌డింది.

ప్ర‌స్తుతం మ‌న్నారా చూపు టాలీవుడ్ పైనే ఉంది. ఇక్క‌డ పెద్ద స్టార్ గా ఎదిగేయాల‌న్న‌ది అమ్మ‌డి ప్లాన్‌. అందుకు త‌గ్గ‌ట్టే టాలీవుడ్‌ లో కొన్ని ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. అదే కోవ‌లో హీరో సునీల్ స‌ర‌స‌న ఓ అదిరిపోయే ఛాన్స్ ప‌ట్టేసింది. ప్ర‌స్తుతం ఈ మూవీ ఆన్‌ సెట్స్ ఉంది. సునీల్‌ తో క‌లిసి త‌న అనుభ‌వాల్ని మ‌న్నారా ఇలా చెప్పుకొచ్చింది.
      
సునీల్ చాలా డౌన్ టు ఎర్త్‌. చాలా క్లోజ్‌ గా ఉంటాడు. స‌రైన టైమింగుతో ఫ‌న్నీగా పంచ్‌ లు వేస్తుంటాడు. అదొక్క‌టే కాదు.. నాకు ఇప్ప‌టికే ఎన్నో టిప్స్ చెప్పాడు. ఫిట్‌ నెస్ గురించి ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ గురించి త‌న‌కి బోలెడ‌న్ని విష‌యాలు తెలుసు. అవ‌న్నీ నాతో షేర్ చేసుకుంటున్నాడు. సునీల్ నాలెజ్ చూస్తే నాకే ఆశ్చ‌ర్యం అనిపిస్తోంది. అంతే కాదు కెమెరా ముందుకు వెళితే సునీల్ చెల‌రేగిపోతాడు... అంటూ మ‌న్నారా తెగ సిగ్గుల మొగ్గ అయ్యింది.
Tags:    

Similar News