కన్నడలో సూపర్ హిట్ అయిన 'బెల్ బాటమ్' చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ఇటీవల ఆహా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఈ డిటెక్టివ్ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. కథా కథనాలు ఎక్కడా సీరియస్ గా లేకుండా.. 80వ దశకంలోని రెట్రో థీమ్ ను తీసుకుని ఆడియన్స్ ని మెప్పించారు. అయితే నిజానికి గతేడాది విడుదలైన ఈ 'బెల్ బాటమ్' చిత్రం హీరో కమ్ కమెడియన్ సునీల్ కి బాగా నచ్చిందట. ఈ సినిమా తనకు బాగా సూట్ అవుతుందని భావించి తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నాడట. ఇంతలోపే ఆహా వారు ఈ సినిమాని డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందించారు. దీంతో సునీల్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డాడని టాక్ నడుస్తోంది.
వాస్తవానికి 'ఆహా'లో 'బెల్ బాటమ్' తెలుగు డబ్బింగ్ వర్షన్ చూసిన వాళ్లంతా ఇలాంటి సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే బాగుండేది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు దీని రీమేక్ రైట్స్ తీసుకుని కొన్ని మార్పులు చేర్పులతో రీమేక్ చేస్తే బాగుంటుందని.. మెగాస్టార్ చిరంజీవి లాంటి వారే ఓటీటీలో తెలుగు వర్షన్ అందుబాటులో ఉన్న 'లూసిఫర్' చిత్రాన్ని కొన్ని చేంజెస్ తో తెలుగులో రీమేక్ చేస్తున్నారని కొంతమంది సన్నిహితులు సునీల్ దగ్గర ప్రస్తావించారట. దీంతో 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని హైడ్ చేయించైనా తెలుగులో రీమేక్ చేయాలని సునీల్ అనుకుంటున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.