సంక్రాంతి బ‌రిలోంచి సునీల్ ఔట్‌

Update: 2015-11-19 05:52 GMT
పూలరంగ‌డు త‌ర్వాత సునీల్ కి హిట్ట‌న్న‌దే లేదు. నా త‌ర్వాత యావ‌రేజ్ సినిమాల‌తో నెట్టుకొచ్చాడు. అందుకే అత‌డి కెరీర్ ఊహించినంత స్వింగులో లేదిప్ప‌డు. చాలా డ‌ల్ ఫేజ్ న‌డుస్తోంది. ప్ర‌తి న‌టుడికి ఇలాంటి ఓ ద‌శ ఉంటుంద‌ని అనుభ‌వ‌జ్ఞులు చెబుతుంటారు. సునీల్ న‌టించిన సినిమా రిలీజై ఇప్ప‌టికే చాలా కాల‌మే అయ్యింది. ఏదైతేనేం ఇన్నాళ్టికి కృష్ణాష్ట‌మి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు వ‌స్తున్నాడు. అయితే ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి? అన్న డైలెమ్మా కొన‌సాగుతోంది.

సునీల్ హీరోగా న‌టించిన కృష్ణాష్ట‌మి 2016 సంక్రాంతి బ‌రిలో రిలీజ‌వుతుంద‌ని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. అయితే ఇప్పుడు సీను మారింద‌ని స‌మాచారం. సునీల్ సంక్రాంతి బ‌రిలో రావ‌డం లేదు. అంత‌కంటే ముందే అంటే క్రిస్ మ‌స్ సెల‌వుల్ని పుర‌స్క‌రించుకుని డిసెంబ‌ర్‌ లోనే రిలీజ్‌ కి వ‌స్తున్నాడ‌ని తెలుస్తోంది. అక్కినేని నాగార్జున హీరోగా న‌టించిన సోగ్గాడే చిన్నినాయ‌నా డిసెంబ‌ర్ లో రిలీజ‌వుతుంద‌ని భావించినా కింగ్ సంక్రాంతి రేసులో వ‌చ్చేందుకే ఆస‌క్తి చూపించారు. దాంతో రిలీజ్ తేదీ మారింది.

ఈ దోబూచు లాట‌లో సునీల్ ఆలోచ‌న మార్చుకుని సంక్రాంతి వార్‌ లోకి ప్ర‌వేశించ‌కుండా ముందే వ‌చ్చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఒక‌వేళ సంక్రాంతి బ‌రిలో రావాలంటే అప్ప‌టికే బాలయ్య‌బాబు డిక్టేట‌ర్‌ - ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో - నాగార్జున సోగ్గాడే చిన్నినాయ‌నా... వంటి సినిమాలు పోటీప‌డుతున్నాయి. వార్ వ‌న్ సైడ్ అయిపోద్ద‌ని తెలివైన ఎత్తుగ‌డ వేశాడు. అదీ సంగ‌తి.
Tags:    

Similar News