సంక్రాంతి పండుగ పోటీ చాలా రంజుగా ఉంది. థియేటర్స్ దొరకవని తెలిసినా, నిర్మాతలు-బయ్యర్లు-డిస్ట్రిబ్యూటర్లు రిస్క్ లో పడతారని తెలిసినా.. అందరూ పండుగ రోజులనే టార్గెట్ చేసుకున్నారు. మూడు పెద్ద సినిమాలు - ఒక చిన్న సినిమా, మరో అరవ డబ్బింగ్.. మొత్తం ఐదు చిత్రాలు రేస్ లో ఉన్నాయి. నిజానికి ఈ పోటీలో సునీల్ కూడా దూరేందుకు ట్రై చేశాడు.
ఓ పండుగ పేరైన కృష్ణాష్టమి పేరుతో రూపొందిన చిత్రాన్ని.. మరో పండుగ సంక్రాంతి రోజున రిలీజ్ చేయాలని భావించాడు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు నిర్మాత దిల్ రాజు. కృష్ణాష్టమికి సంబంధించిన ఫస్ట్ కాపీ కూడా చేతిలో సిద్ధంగా ఉందని టాక్. ఈనెల 9న ఆడియో వేడుకను కూడా జరపబోతున్నారు. అన్నీ సిద్ధంగా ఉన్నా సరే.. సంక్రాంతి రేస్ నుంచి సునీల్ తప్పుకున్నాడు. బాలకృష్ణ డిక్టేటర్ - ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో - సోగ్గాడే చిన్ని నాయన చిత్రాలకే సరిపడేంతగా థియేటర్స్ దొరికే పరిస్థితి లేదు. ఇక అనేక అంచనాలుండి చిన్న సినిమాగా వస్తున్న ఎక్స్ ప్రెస్ రాజా కూడా.. బ్లాక్ బస్టర్ పైనే కన్నేశాడు. ఇక విశాల్ అయితే కథకళి ఆడక తప్పదని తేల్చేశాడు.
ఇన్నింటి మధ్యలో నలిగిపోయే పదులు.. తాపీగా కొన్నాళ్లు ఆగి రిలీజ్ చేద్దామని నిర్మాత దిల్ రాజు నిర్ణయించుకున్నాడు. దీంతో సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న మొదటి సినిమా కృష్ణాష్టమి అయింది. ఈ మూవీలో సునీల్ సరసన నిక్కీ గల్రానీ - డింపుల్ చోపడేలు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ నెల 9న రాజమండ్రిలో భారీగా ఆడియో వేడుక నిర్వహించనున్నారు.