పూలరంగడితో 'దర్జా' చూపించనున్న రంగమ్మత్త

Update: 2021-10-25 05:30 GMT
హీరోగా మరియు కమెడియన్‌ గా ఇంకా విలన్ గా కూడా వరుస సినిమాలు చేస్తున్న సునీల్‌ తాజాగా దర్జా అనే సినిమాను ప్రకటించిన విషయం తెల్సిందే. సినిమా టైటిల్ లోగోను ఇటీవలే రివీల్‌ చేయడం జరిగింది. ఈ సినిమా చిత్రీకరణ కు ఏర్పాట్లు ముగిశాయట. అతి త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమా లో సునీల్ ఒక విభిన్నమైన పాత్రను చేస్తున్నట్లుగా ఇప్పటికే యూనిట్‌ సభ్యులు అంటున్నారు. తన ఇమేజ్ కు తగ్గ పాత్రను సునీల్‌ చేయబోతుండగా ఆయనకు జోడీగా జబర్దస్త్‌ యాంకర్ రంగమ్మత్త అలియాస్ అనసూయ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబోను అల్లు అర్జున్‌ పుష్ప లోనే చూడబోతున్నట్లుగా మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.

పుష్ప లో ఇద్దరి కాంబో సన్నివేశాలు ఉంటాయో లేదో తెలియదు కాని.. దర్జా సినిమాలో మాత్రం ఫుల్ లెంగ్త్‌ పాత్రల్లో ఇద్దరు చేస్తున్నారు. ఈ సినిమా సునీల్‌ మరియు అనసూయ కెరీర్ లకు చాలా పెద్ద విషయం. అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న సమయంలో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ హీరోయిన్ గా చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. సునీల్‌ తో ఈ సినిమాను చేయబోతున్న అనసూయకు ఖచ్చితంగా ముందు ముందు ఆఫర్ల విషయంలో ఈ సినిమా చాలా హెల్త్‌ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే దర్జా సినిమా అనసూయకు చాలా కీలకంగా మారింది.

మరో వైపు సునీల్‌ హీరోగా కెరీర్‌ లో వరుస ప్లాప్‌ ల వల్ల మళ్లీ కమెడియన్‌ గా సినిమా లు చేయాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో హీరోగా ఆఫర్లు అందివస్తున్నాయి. మళ్లీ వస్తున్న హీరో ఆఫర్లను సునీల్‌ సద్వినియోగం చేసుకుని దర్జాగా మళ్లీ హీరోగా వరుస సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా అనసూయ అభిమానులతో పాటు సునీల్‌ అభిమానులకు కూడా చాలా ఆసక్తిని కలిస్తుంది. ఈ సినిమా హైదరాబాద్‌.. భీమవరం మరియు మచిలీపట్నంలో చిత్రీకరించబోతున్నారు. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివ శంకర్‌ పైడపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.



Tags:    

Similar News