సునీల్ సినిమా పేరు... జ‌క్క‌న్న‌?!

Update: 2015-12-04 22:30 GMT
ఎప్పుడో మొద‌లైన `కృష్ణాష్ట‌మి` ప్రేక్ష‌కుల ముందుకు రావడంలో ఆల‌స్యం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ సునీల్ మాత్రం కొత్త సినిమాల విష‌యంలో ఇటీవల వేగం పెంచాడు. వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో మొద‌లైన సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల వైజాగ్‌లో కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. ఈ సినిమాకి ప‌లు టైటిళ్లు ప్ర‌చారంలో ఉన్నాయి. అగ్గిపుల్ల‌, సైనికుడువంటి పేర్ల‌ను ప‌రిశీలించారు. అయితే ఇప్పుడు `జ‌క్క‌న్న‌` అనే మ‌రో టైటిల్ పెట్టే విష‌యం గురించి ఆలోచిస్తున్నార‌ట‌.

ఒక టిపిక‌ల్ సబ్జెక్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై సునీల్ చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడు. చివ‌రిగా సునీల్ చేసిన ఒక‌ట్రెండు చిత్రాలు స‌రైన ఫ‌లితాన్నివ్వ‌లేక‌పోయాయి. అందుకే  `కృష్ణాష్ట‌మి`తో మొద‌లుపెట్టి వ‌రుస‌గా విజ‌యాలు అందుకోవాల‌న్న క‌సితో ఉన్నారు సునీల్‌. ఆ మేర‌కు పక్కా ప్ర‌ణాళిక‌ల‌తో అడుగులేస్తున్నాడు. ఆకెళ్ల చిత్రం త‌ర్వాత ర‌చ‌యిత గోపీమోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అలాగే మ‌రో ఇద్ద‌రు మ‌గ్గురు యువ ద‌ర్శ‌కుల‌తోనూ స్క్రిప్టులు సిద్ధం చేయించిన‌ట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News