బ్రహ్మానందం తర్వాత ఆ స్థాయిలో స్టార్ ఇమేజ్ సంపాదించిన కమెడియన్ సునీల్. ఐతే కమెడియన్ గా బండి బాగానే నడుస్తున్న టైంలో అనుకోకుండా హీరో అయిన ఈ బొద్దబ్బాయి.. ఆ తర్వాత హీరో వేషాలు తప్ప ఇంకేమీ చేయనని భీష్మించుకుని కూర్చున్నాడు. ఐతే సినిమాలు బాగా ఆడినపుడు అంతా బాగుంది కానీ.. వరుసగా రెండు ఫ్లాపులు తిన్నాక మాత్రం పరిస్థితి ఏమీ బాగా లేదు. ఏడాదిన్నర విరామం తర్వాత ఓ సినిమా చేస్తే.. అది విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత తీసిన సినిమా అయినప్పటికీ ‘కృష్ణాష్టమి’కి సరైన రిలీజ్ డేట్ దొరకడం లేదు.
నవంబరుకే ఈ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నాడు రాజు. కానీ కుదర్లేదు. తర్వాత క్రిస్మస్ రిలీజ్ ప్లాన్ చేశాడు. అదీ సాధ్యపడలేదు. సంక్రాంతికి అనుకుంటే అక్కడ బెర్తులు ఖాళీ లేవు. పెద్ద సినిమాలు వరుస కట్టేశాయి. ఇక ఆఫ్ సీజన్ అయిన ఫిబ్రవరికి వెళ్లాలి. డేటు ఏదో ఒకటి చూసుకుంటారు కానీ.. సునీల్ ట్రాక్ రికార్డు ఏమంత బాగా లేకపోవడం, వాసు వర్మ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ తీసిన సినిమా కావడంతో అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగట్లేదంటున్నారు. రాజు ఏమో సునీల్ రేంజికి మించి ఖర్చు పెట్టేశాడు. ఫారిన్ లొకేషన్లలో భారీ లెవెల్లో సినిమా తీయించాడు. మరి బిజినెస్ అవగొట్టి మంచి డేటుకు రిలీజ్ చేయడం కొంచెం కష్టమైన పనే. ఐతే సినిమా విషయంలో రాజుతో సహా అందరూ కాన్ఫిడెంట్ గా ఉన్న నేపథ్యంలో సొంతంగా అయినా రిలీజ్ చేసుకునే అవకాశాలున్నాయి.