సునీల్ ఈ మధ్య కనిపించి చాలా కాలం అయింది. కమెడియన్ నుంచి హీరోగా టర్నింగ్ ఇచ్చుకున్నాక.. జనాలకు ఇంతకాలం కనిపించకుండా ఉన్నది ఇప్పుడే. ఒకేసారి మూడు సినిమాలను లైన్ లో పెట్టడంతో పాటు, షూటింగ్ విషయంలో కొన్ని మిస్టేక్స్ కూడా రిలీజ్ లేట్ అవడానికి కారణం అయ్యాయి.
మొత్తానికి ఇప్పుడో సినిమాని రిలీజ్ కి రెడీ చేశాడు సునీల్. జోష్ ఫేం వాసూవర్మ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన కృష్ణాష్టమి.. విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు దిల్ రాజు - సునీల్. ఒకవైపు బాబాయ్ డిక్టేటర్ - అబ్బాయ్ నాన్నకు ప్రేమతో పోటీలో ఉండగానే, తానూ వచ్చి రేస్ లో జాయిన్ అయ్యాడు అక్కినేని నాగార్జున. తన మూవీ ఎంటర్ టెయినర్ జోనర్ లోది కాబట్టి, ప్రేక్షకులకు ఢోకా ఉండదని చెప్పేశాడు. ఇక శర్వానంద్ కూడా ఎక్స్ ప్రెస్ రాజా అంటూ పండక్కే వస్తానన్నాడు. విశాల్ నటించిన డబ్బింగ్ మూవీ కథాకళి కూడా సంక్రాంతికే రానుంది.
ఇన్నింటి మధ్యలో సునీల్ కృష్ణాష్టమి అంటే కష్టమే అనిపిస్తున్నా.. ఎన్టీఆర్ పై డౌట్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఓ స్లాట్ ని బుక్ చేసుకుంటున్నాడు దిల్ రాజు. మరోవైపు నాగార్జున స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే.. సునీల్ కి ఉండే ఆడియన్స్ సునీల్ కే ఉంటారు కాబట్టి.. ఆ వైపు కూడా ఆలోచించి రిలీజ్ చేసేయచ్చు. ఏమైనా పైన చెప్పిన భారీ సినిమాల్లో ఏదో ఒకటి డ్రాప్ అయితేనే.. మిగిలిన మూవీస్ కి ఛాన్స్ అనే విషయంపై మాత్రం కన్ఫ్యూజన్ అవసరం లేదు.