కమెడియన్ నుంచి హీరోగా మారిపోయిన సునీల్.. ఇప్పుడు కృష్ణాష్టమి మూవీని తెరపైకి తెస్తున్నాడు. ఫిబ్రవరి 19న విడుదల కానున్న ఈ మూవీ కోసం.. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. సునీల్ కెరీర్ లోనే ఇంతగా పబ్లిసిటీ చేసిన మూవీ మరొకటి లేదనే రేంజ్ లో వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సమయంలో హీరో సునీల్ కూడా ఉత్సాహంగా ఇంటర్వ్యూలిచ్చేస్తున్నాడు.
మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ.. సునీల్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. సునీల్ ని ప్రశ్నలు అడిగేవారందరూ ఓ క్వశ్చన్ ని మాత్రం కామన్ గా అడుగుతున్నారట. 'కృష్ణాష్టమి అంటూ కృష్ణుడిగా నటిస్తున్నారు. మరి మీ సినిమాలన్నిటిలోనూ ఇద్దరేసి హీరోయిన్స్ ఉంటారు. అంటే రియల్ లైఫ్ లో కూడా కృష్ణుడిగా ఉండడం మీకు ఇష్టమా?' అనే ప్రశ్న మాత్రం తప్పడం లేదట. ఇది వినీ వినీ బోర్ కొట్టేసిందన్న సునీల్.. ఏదన్నా కొత్తగా అడిగేందుకు ట్రై చెయ్యండి ప్లీజ్ అంటున్నాడు.
అసలు ఈ ప్రశ్న అడిగిన వాళ్లనే.. 'మీరు అలా ఉండాలని కోరుకుంటున్నారా ఏంటి' అని ఎదురు ప్రశ్న వేద్దామని అనిపిస్తోందట సునీల్ కి. తాను చాలా ఓపెన్ గా ఇంట్రెస్టింగ్ సంగతులు పంచుకోవడానికి రెడీ అయితే.. మూస ప్రశ్నలతో చిరాకు పెట్టించేస్తున్నారని తెగ బాధపడిపోతున్నాడు సునీల్.