హీరో అవ్వడమే ఆలస్యం. ఒక్క హిట్టు కొడితే చాలు. వరుసగా ఛాన్సులే ఛాన్సులు. సక్సెస్ ఎంత ఊపు తెస్తుందో.. ఊహించడమే కష్టం. ఈ మెగా హీరో విషయంలో అదే జరుగుతోంది. ఇతడు కేవలం వన్ ఫిలిం వండర్ మాత్రమే. అయినా ఇప్పటికిప్పుడు ఇతడి కెరీర్‌లో రెండు క్రేజీ ప్రాజెక్టులు వచ్చి చేరాయి. ఒకటి ఆన్‌సెట్స్ ఉంది. వేరొకటి కథా చర్చల్లో ఉంది. మరికొన్ని సైలెంటుగా స్క్రిప్టు డెవలప్‌మెంట్‌లో ఉన్నాయి. అసలింతకీ ఎవరి గురించి ఈ చర్చ. అవును మీరూహించిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ గురించే.
ఇక డీటెయిల్స్‌లోకి వెళితే... సాయిధరమ్ ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. తొలి సినిమాతోనే ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సాయిధరమ్. కుర్రాడిలో బోలెడంత విషయం ఉంది. అవకాశాలిస్తే తప్పేం కాదని దర్శకులంతా వెంటపడుతున్నారిప్పుడు. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో నటిస్తున్నాడు. అది సెట్స్‌లో ఉండగానే 'ఓం 3డి' డైరెక్టర్ అనీల్ రెడ్డి ఓ కథ చెప్పి ఒప్పించాడు. మొదటి షెడ్యూల్ శ్రీలంకలో ప్లాన్ చేస్తున్నారు. 40రోజుల షూటింగుకి రెడీ అవుతున్నారు. వరుసగా ఒకదాని వెంట ఒకటిగా అవకాశాలొస్తున్నాయి. ట్యాలెంటెడ్ డైరెక్టర్లతో సావాసం కోసం యత్నిస్తూ దూసుకొస్తున్నాడు. చరణ్, బన్నిలకు ధీటైన పోటీ ఇచ్చే మగధీరుడీయనే అని టాక్.