ఏనుగు చచ్చినా బ్రతికినా ఒకటే రేట్ అనే సామెత ఊరికే రాలేదు కామోసు. సినిమా పరిశ్రమలో కొందరికి ఇది అక్షరాలా వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ చావు బ్రతుకు కాదు కానీ సక్సెస్ ఫెయిల్యూర్ అనే ఉపమానంతో వాటిని రీ ప్లేస్ చేయొచ్చు. కమెడియన్ సునీల్ పరిస్థితి ఇప్పుడు అచ్చం ఇలాగే ఉంది. హాస్య నటుడిగా కెరీర్ మొదలుపెట్టి చిన్న చిన్న వేషాలతో గుర్తింపు తెచ్చుకుని ఆనతికాలంలోనే టాప్ కమెడియన్ గా ఎదిగిన తీరు సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రతిఒక్కరికి విదితమే. అందాల రాముడుతో హీరోగా ట్రై చేస్తే అది కాస్త అనూహ్యంగా విజయం సాధించడం ఆ తర్వాత మర్యాద రామన్న పూల రంగడు లాంటి సినిమాలు నిర్మాతలకు లాభాల పంట పండించడం వెరసి సునీల్ కొన్నేళ్ల పాటు హీరో మత్తులో మునిగేలా చేసాయి. వరస పరాజయాలతో పాటు మార్కెట్ లో మినిమమ్ గ్యారెంటీ బ్రాండ్ కూడా పోవడంతో సునీల్ సరైన టైంలోనే తిరిగి తన పాత లీగ్ లోకి వచ్చి హాస్య నటుడిగా ఫ్రెష్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.
అయినా కూడా సునీల్ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని ఇండస్ట్రీ టాక్. జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవతో పాటు రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీలో కూడా మంచి స్పాన్ ఉన్న పాత్రలు దక్కించుకున్న సునీల్ - అల్లరి నరేష్ కాంబోలో చేసిన సిల్లీ ఫెలోస్ బిజినెస్ బాగా జరుగుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. సైరాలో కూడా పాత్ర చేస్తున్నానని సునీల్ అన్నాడు కానీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇప్పుడు రెమ్యునరేషన్ హోల్ సేల్ గా కాదు కానీ కమెడియన్లు సాధారణంగా ఫాలో అయ్యే రోజువారీ పారితోషికం ఫార్ములాలో 3 లక్షల దాకా ఛార్జ్ చేస్తున్నాడట. ఇది ఇప్పుడు ఫామ్ పీక్స్ లో వెన్నెల కిషోర్ లాంటి వాళ్ళ కన్నా ఎక్కువ అని టాక్. అటు ఇటుగా వాళ్ళ రేట్ 2 లక్షల వరకే ఉందని టాక్. మొత్తానికి సునీల్ ఇంత గ్యాప్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇస్తున్నా డిమాండ్ విషయంలో ఇంకా పీక్స్ లోనే ఉండటం విశేషం. చూస్తుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ పరుగులు సాధించేలా ఉన్నాడు.