కమెడియన్ సునీల్ .. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మధ్య అనుబంధం గురించి తెలిసిందే. ఆ ఇద్దరూ రూమ్ మేట్స్. ఒకే కాలేజ్ లో చదువుకున్నారు. తనకంటే సీనియర్ అయిన త్రివిక్రమ్ ని తన స్వార్థంతోనే ఇండస్ట్రీకి తెచ్చి తన రూమ్ లోనే చోటిచ్చాడు సునీల్. ఆ సంగతిని ఆయనే చెప్పారు. అందుకు తగ్గట్టే సునీల్ ని నటుడిగా మలిచిన గొప్ప ఫ్రెండుగా త్రివిక్రమ్ స్నేహ ధర్మాన్ని నిలబెట్టుకున్నారు. ఆ ఇద్దరి కెరీర్ జర్నీ ఆద్యంతం తెలిసిందే. అయితే ఇదంతా తెలిసిన పాత కథే అయినా.. ప్రస్తుతం సునీల్ రీఎంట్రీకి త్రివిక్రమ్ సాయం ఏమాత్రం ఉపయోగపడకపోవడం చర్చకొచ్చింది.
హీరోగా పూర్తిగా వైభవం కోల్పోయిన సునీల్ కి ఎలాగైనా అదిరిపోయే బ్రేక్ ఇవ్వాలని ఎన్టీఆర్ `అరవింద సమేత`లో అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు త్రివిక్రమ్. ఆ సినిమాలో సునీల్ పాత్రకు పేరొచ్చినా కానీ ఆ తర్వాత ఎందుకో ఊహించినంతగా అతడికి ఆఫర్లు అయితే రాలేదు. అయినా తన స్నేహితుడు కాబట్టి మరోసారి అల్లు అర్జున్ సినిమాలోనూ త్రివిక్రమ్ ఛాన్సిచ్చారు. కానీ దురదృష్టం కొద్దీ ఈ సినిమా విషయంలో ఊహించని ఓ మలుపు తనకు క్యారెక్టర్ లేకుండా చేసింది. ఈ సినిమా నుంచి సునీల్ ని తప్పించాల్సి వచ్చిందట. వాస్తవానికి బన్నీ సినిమాలో రావురమేష్ పాత్రతో పాటు సునీల్ పాత్ర వుంటుందని తెలుస్తోంది. కానీ ఎప్పడైతే రావు రమేష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారో అప్పుడు సునీల్ పాత్రను ట్రిమ్ చేయాల్సి వచ్చిందట. రావు రమేష్ బదులుగా హర్ష వర్ధన్ జాయిన్ అయ్యారు. ఇక ఆ కాంబినేషన్ నుంచి సునీల్ ఎగ్జిట్ అయ్యారు కాబట్టి కాంబినేషన్ తో పని లేకుండా త్రివిక్రమ్ మార్చేశారట. ఆసక్తికరంగా ఇదే చిత్రంలో పృథ్వీ నటించాల్సింది. కానీ పవన్ పై విమర్శలతో అతడిని తప్పించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ - వెన్నెల కిషోర్ మధ్య సన్నివేశాలు మాత్రం అద్భుతంగా పండాయని తెలుస్తోంది. వెన్నెల కోసం త్రివిక్రమ్ తనదైన మార్క్ పంచ్ లతో అదిరిపోయే రోల్ రాశారట. సెకెండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీక్వెన్స్ లో కూడా కిషోర్ పగలబడి నవ్వేలా కామెడీ చేస్తాడట. మొత్తానికి సెట్స్ లో ఉండగానే బోలెడన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అయితే సునీల్ విషయంలోనే ఫ్రెండు అన్యాయం చేశాడా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏఏ19 గా చెబుతున్న ఈ సినిమా టైటిల్ ని ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. సుశాంత్, నవదీప్ సహా మేటి నాయిక టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ - హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా 2020 లో విడుదల కానుంది.