మెగాస్టార్ డైలాగులు వేస్టే అయ్యాయ్

Update: 2017-09-16 13:21 GMT
సినిమా పరిశ్రమలో ఎంతటివారికైనా అపజయాలు పరిచయం కాకుండా ఉండలేవు. కెరీర్ లో ఎన్నో సక్సెస్ లు అందుకున్న వారు కూడా ఒకానొక సమయంలో వరుస అపజయాలను అందుకుంటారు. కొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోలుగా వెలుగుతున్నారు. కానీ కొంతమందికి మాత్రం ఆ దారి అస్సలు కలిసిరావడం లేదు. అలాగే ఇంతకుముందే బాగుండేది కాదా.. అని అనుకోని కాస్త బాధలో ఉంటున్నారు. ఒకప్పటి టాప్ కమెడియన్ సునీల్ కూడా ఇప్పుడు హీరోగా చేస్తూ అదే తరహాలో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.

మొదట్లో రెండు సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న సునీల్ ఆ తర్వాత వరుస పరాజయాలతో తనకు సపోర్ట్ గా ఉన్న ప్రేక్షకులను దూరం చేసుకున్నాడు. కామెడీయన్ గా మెప్పించినా కథానాయకుడిగా మెప్పించలేకపోయాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన "ఉంగరాల రాంబాబు" పరిస్థితి కూడా దాదాపు అదే పరిస్థితుల్లో ఉంది. అయితే వ్యక్తిగతంగా సునీల్ మెగాస్టార్ అభిమాని అని అందరికి తెలిసిన విషయమే. అంతే కాకుండా సునీల్ తన సినిమాల్లో చాలా వరకు మెగాస్టార్ ని ఇమిటేట్ చేస్తూ కనిపించేవాడు. అయితే ఇప్పుడు ఉంగరాల రాంబాబు లో కూడా మనోడు కాస్త మెగా ఫ్యాన్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేశాడు.

ఖైదీ నెంబర్ 150 సినిమాలోని కొన్ని సీన్స్ ని సునీల్ స్పూఫ్ చేశాడు. అలాగే చిరు ని కూడా పలురకాలుగా ఇమిటేట్ చేశాడు. కానీ క్రాంతి మాధవ్ డైరెక్షన్ పేలవంగా ఉండడంతో ఆ సన్నివేశాలు బెడిసికొట్టాయి. ఏ మాత్రం బాలేకపోవడంతో మెగాఫ్యాన్స్ కూడా నిరాశచెందారు. సినిమా హైప్ కోసం ఇతర హీరోలను వాడుకోవడంలో తప్పులేదు గాని అనవసరంగా అవసరం లేని చోట అర్ధం లేకుండా సీన్స్ ను తీస్తే ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.


Tags:    

Similar News