తెలుగు పాటని మరింత సున్నితంగా చూసుకున్న స్వరం సునీత సొంతం. అందమైన కోకిల అనిపించుకున్న ఆమె, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె స్వరం నుంచి జాలువారిన పాటలు పూత రేకుల్లా సుతిమెత్తగా వీనుల విందు చేస్తాయి.
గాయనిగా ఆమె 25 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. తను పాడిన వాటిల్లో మెలోడీ హిట్స్ ను ఎంపిక చేసుకుని ఆమె ఒక షో ఇస్తున్నారు. జనవరి 8వ తేదీన 'మెలోడియస్ మూమెంట్స్ విత్ సునీత' పేరుతో ఈ షో ప్రదర్శితమవుతోంది. బాలు గారిని గుర్తుచేసుకుంటూ ఈ షో మొదలవుతుందని సునీత చెప్పారు.
ఆమె మాట్లాడుతూ .. "గాయనిగా 25 సంవత్సరాల సక్సెస్ ఫుల్ కెరియర్ ను చూశాను. అది అంత సులభమైన విషయమేం కాదు .. అలా అని కత్తిమీద సాము కూడా కాదు.
అందరూ కలిసి నన్ను ముందుకు తీసుకెళ్లిపోయారు. దానికి నేను సినిమా పరిశ్రమలోని సంగీత దర్శకులందరికీ, అలాగే నాతో డబ్బింగ్ చెప్పించిన దర్శక నిర్మాతలకు .. ముఖ్యంగా బాలు గారికి మనసారా థ్యాంక్స్ చెబుతున్నాను. డెఫినెట్లీ ఆయన పై నుంచి చూస్తుంటారు ఆశీర్వదిస్తుంటారు .. ఆ నమ్మకం నాకు ఉంది.
పాట మీద మమకారం కలిగించింది .. ప్రొఫెషన్ ను చాలా సీరియస్ గా తీసుకోవడంతో పాటు, ఎంత నిబద్ధతతో ఉండాలనే చాలా విషయాలను వారి దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను.
ఇలా ఒక్కొక్కరినీ చూసి నేర్చుకుంటూ ఒక పక్క కెరియర్ ను ఒక పక్క పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడంలోనే టైమ్ గడిచిపోయింది. నిజం చెప్పాలంటే నా జీవితంలోను చాలా ఆటుపోట్లు ఉన్నాయి. నా విషయంలో ప్రొఫెషనల్ గా కంటే కూడా పర్సనల్ లైఫ్ గురించిన విషయాలపైనే ఎక్కువ క్యూరియాసిటీ చూపించారు.
అయితే దానిని నేను ఎప్పుడూ కూడా నెగెటివ్ గా తీసుకోలేదు. రేపు ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ రోజు ఊహించలేము కదా. ఆర్థికపరమైన విషయాలనైతే మనం ముందుగా ప్లాన్ చేసుకోగలుగుతాము గానీ, పరిస్థితులకు సంబంధించిన విషయాలను మనం ప్లాన్ చేసుకోలేము కదా.
ఎప్పటికప్పుడు న్యూ ఎక్స్ పీరియన్స్ .. ఆ ఎక్స్ పీరియన్స్ నుంచి నేర్చుకున్న పాఠాలు, మళ్లీ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జాగ్రత్తపడేలా చేశాయి. ఈ సందర్భంగా నేను భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.
ఇక వైపున పాటలు పడుతూ .. మరో వైపున డబ్బింగ్ చెబుతూ .. హోస్ట్ గా చేస్తూ వచ్చాను. అయినా నా స్వరంలో మాధుర్యం తగ్గలేదు. అందుకు నేను ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే నా వరకూ నేను నా వాయిస్ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాను. మీ అందరి ఆదరణ .. భగవంతుడి అనుగ్రహం అందుకు తోడయ్యాయి" అని చెప్పుకొచ్చారు.