సన్నీ సీక్వెల్ వస్తోంది

Update: 2016-02-05 15:30 GMT
పాతికేళ్ల క్రితం సన్ని డియోల్ నటించిన ఘాయల్ ఓ సంచలనం. దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న మూవీ ఇది. ఈ హీరోకి నేషనల్ అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది ఘాయల్. మళ్లీ ఇప్పుడీ మూవీకి సీక్వెల్ సిద్ధం చేశాడు సన్నీ డియోల్. ఘాయల్ వన్స్ ఎగైన్ అనే టైటిల్ తెరకెక్కిన సీక్వెల్.. ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఘాయల్ లో సన్నీకి జైలు శిక్ష పడ్డంతో స్టోరీ ఎండ్ అవుతుంది. అక్కడి నుంచి కంటిన్యూ చేసి సీక్వెల్ స్టార్ట్ చేస్తున్నారు. జైలు జీవితం పూర్తయ్యాక.. ఓ న్యూస్ పేపర్ స్టార్ట్ చేసి అక్రమాలపై యుద్ధం చేస్తుంటాడు హీరో. ఇతన్ని అభిమానించే నలుగురు యువతీ యువకులు.. ఓ ఫోటో ఎగ్జిబిషన్ లో జరిగిన  హత్యను చూస్తారు. వీరి దగ్గరున్న కెమేరాలో.. ఆ హత్య రికార్డ్ అవుతుంది. ఆ మర్డర్ చేసిన వారిలో ఇద్దరు హై ప్రొఫైల్ వ్యక్తలు.. ఈ నలుగురినీ చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో వారిని హీరో ఎలా కాపాడాడు అన్నదే ఘాయల్ ఒన్స్ ఎగైన్ స్టోరీ.

ఘాయల్ సీక్వెల్ కి సన్నీ డియోల్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తోంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ సినిమాలకు స్టంట్స్ సమకూర్చిన డాన్ బ్రాడ్లీ.. ఘాయల్ వన్స్ ఎగైన్ కు యాక్షన్ సమకూర్చాడు. హాలీవుడ్ మూవీ ట్రూ లైస్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిందనే టాక్ ఉంది.

Tags:    

Similar News