సన్నీ లియోన్ అనగానే కుర్రాళ్లలో ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఆమెను కేరాఫ్ ఎంటర్టైన్మెంట్ గా భావిస్తుంది కుర్రకారు. ఆమె సినిమాల సంగతి పక్కన పెడితే బయట కూడా ఎప్పుడూ హుషారుగా ఉంటుంది. సోషల్ మీడియాలో స్పైసీ పోస్టులతో తన ఫాలోవర్లను అలరిస్తూ ఉంటుంది. అలాంటి సన్నీ తాజాగా చాలా ఉద్వేగంతో ఒక ట్వీట్ చేసింది. తాజాగా సన్నీ ఒక రోజు రాత్రంతా ఏడుస్తూ ఉండిపోయిందట. ఆమె హృదయం వెయ్యిసార్లు బద్దలైందట.
ఆమె అంతగా ఉద్వేగానికి గురవడానికి కారణం ఏంటి అంటే.. తన జీవిత కథతో తెరకెక్కిన ‘కరణ్ జీత్ కౌర్: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్’ డాక్యుమెంటరీ ప్రివ్యూ చూడటమే. కరణ్ జీత్ అన్నది సన్నీ అసలు పేరు. ఆమె సన్నీ లియోన్ గా ఎందుకు మారింది.. పోర్న్ స్టార్ ఎందుకైంది.. అందుకు దారి తీసిన పరిస్థితులు ఆ ఇండస్ట్రీలో ఆమెకు ఎదురైన అనుభవాలు.. ఆపై పోర్న్ సినిమాలు మానేసి.. రెగ్యులర్ సినిమాల్లోకి వచ్చి అభిమానుల ఆదరణ సంపాదించడం.. ఈ వైనం మొత్తాన్ని ఇందులో చూపించారు. ఇటీవలే చిత్రీకరణ కూడా పూర్తయింది.
ఈ నేపథ్యంలో సన్నీ ఈ డాక్యుమెంటరీ ప్రివ్యూ చూసింది. అది చూస్తుండగా సన్నీ తీవ్ర భావోద్వేగానికి గురైందట. షో చూస్తున్నంతసేపూ తనకు కన్నీళ్లు ఆగలేదని.. తన హృదయం వెయ్యిసార్లు బద్దలైందని.. రాత్రంతా తాను ఏడుస్తూ ఉన్నానని ఆమె చెప్పింది. పోర్న్ సినిమాల్లోకి రాకముందు తాను ఎలా ఉండేదాన్నో మళ్లీ అలా ఉండాలని తాను కోరుకుంటున్నానని.. కానీ ఆ రోజు ఎప్పటికీ రాదని.. తన పాత వ్యక్తిత్వం ఎప్పటికీ గుర్తుంటుందని సన్నీ చెప్పింది. తాను జీవితంలో తప్పు చేశానేమో అన్న భావన తనకు ఈ డాక్యుమెంటరీ చూస్తున్నపుడు కలిగిందని సన్నీ పేర్కొనడం గమనార్హం.