కథానాయికలు అంటే పిచ్చి క్రేజు. ముఖ్యంగా మాస్ జనాలు పడిచస్తారంటే అతిశయోక్తి కాదు. తమ అభిమాన దేవత క్రీగంటి చూపు కోసం మైళ్ల దూరాన్ని సైతం లెక్చచేయరు. అడుగులో అడుగు వేసుకుంటూ దూరాల్ని ఛేదిస్తారు. కొంటె కోమలాంగి నుంచి కొంటె తలపుల్ని తాకే ఒకే ఒక్క ఓరచూపు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తారు. ఎక్కడైనా షూటింగ్ జరుగుతోంది అంటే తనివితీరా తమ అభిమాన నాయికను చూసుకోవాలని ఆత్రపడతారు.
ఇంతకీ విషయం ఏమంటే అందాల సన్నీలియోన్ ప్రస్తుతం ఏక్ పహేలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మెజారిటీ భాగం రాజస్థాన్‌లో చిత్రీకరించారు. అక్కడ స్థానికుల్ని కూడా భాగం చేసి షూటింగ్ చేశారు. కొన్ని సన్నివేశాలు, పాటల్లో స్థానికుల్ని కూడా చూపించారు. ఒకానొక సన్నివేశంలో అక్కడ తలపాగా బాబుల్ని సన్నీ పక్కనే లైన్‌లో నిలుచోబెట్టారు. ఆ ఒక్క సన్నివేశం కోసం రాజస్థానీలు స్వయంగా థియేటర్లపై ఎగబడడం ఖాయం అన్న లెక్కలు వేస్తున్నారంతా.
ఏదేమైనా స్థానికుల్ని భాగస్తుల్ని చేయడం ద్వారా ప్రచారపర్వాన్ని సులువు చేసేశారు. అయితే సన్నీ అభిమానులుగానే సదరు ప్రజానీకం ఇలా లైన్‌లో నిలబడ్డారు తప్ప మార్కెట్ లెక్కలేవీ వారి మనసులో ఉండవన్నది వాస్తవం. ప్లాన్ బావుంది. దీన్ని మన టాలీవుడ్‌లోనూ సందర్భానుసారం వాడేస్తున్నారు.