ఐటమ్ సాంగ్ అంటే తెలియదట

Update: 2016-12-19 22:30 GMT
సన్నీ లియోన్. శృంగార తారగా.. పోర్న్ చిత్రాల నటిగా.. ఈమెకు చాలా మంది అభిమానులున్నారు. బాలీవుడ్ హీరోయిన్ గా బిజీ అయిన తర్వాత.. సన్నీ లియోన్.. పోర్న్ సినిమాల్లో నటించడం తగ్గించేశారు. అయినా.. ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం.. తగ్గలేదు. ఆమె డ్యాన్స్ ఉంటే చాలు.. సినిమా చూసేందుకు ఎగబడ్డారు. అలాంటి క్రేజ్ ను ఉపయోగించుకునేందుకే.. షారుఖ్ ఖాన్ కొత్త సినిమా రయీస్ లో.. సన్నీ తో ఐటమ్ సాంగ్ చేయించారు.

లైలా మే లైలా అంటూ సాగే ఈ పాట షూటింగ్ కూడా పూర్తయింది. దీని గురించి మాట్లాడిన సన్నీ లియోన్.. అసలు ఐటమ్ సాంగ్ అంటే ఏంటో తనకు తెలియదని చెప్పింది. ఇలాంటి పాటలు బాలీవుడ్ లో మొదటి నుంచి ఉన్నాయన్న సన్నీ.. ఐటమ్ సాంగ్ అని ఎందుకంటున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పింది. తన దృష్టిలో ఇలాంటి పాటలు తప్పు కాదని కూడా చెప్పింది.

అంతే మరి.. పోర్న్ చిత్రాల్లో నటించిన ఓ హీరోయిన్ కు.. ఐటమ్ సాంగ్స్ లో నటించేందుకు అభ్యంతరం ఏముంటుంది అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అందుకే.. ఆమెకు ఐటమ్ సాంగ్ అన్న పదానికి అర్థం తెలియాల్సిన అవసరం కూడా లేదని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News