ఆ సినిమా చెత్త అని తేల్చేసిన నటుడు

Update: 2019-04-03 01:30 GMT
ఒక సినిమా అందరికీ నచ్చాలని రూల్ ఏమీ లేదు. 'బాహుబలి' సినిమాను నచ్చనివారు ఉన్నారు.  'అర్జున్ రెడ్డి' నచ్చనివారు కూడా ఉన్నారు.  అయితే అందరూ సూపర్ డూపర్ అనే సినిమాను నచ్చలేదు అని చెప్పడం చాలా కష్టం.   ఒకవారం క్రితం తమిళంలో 'సూపర్ డీలక్స్' అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ఆడియన్స్ ను.. క్రిటిక్స్ ను చితగ్గొట్టేసింది.

ఆ కంటెంట్ ను చూసి థ్రిల్లయిన ప్రేక్షకులు కల్ట్ ఫిలిం అంటున్నారు. క్రిటిక్స్ అయితే ఉదారంగా 3.5 నుంచి 4 వరకూ రేటింగ్స్ ఇచ్చారు.  'సూపర్ డీలక్స్' సినిమాకు త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకుడు. తన మొదటి సినిమా 'అరణ్యకాండం' కు నేషనల్ అవార్డు లభించింది. ఇది రెండో సినిమా.  విజయ్ సేతుపతి.. సమంతా.. రమ్యకృష్ణ.. ఫహద్ ఫాజిల్.. ఈ సినిమాలో ప్రధాన తారాగణం. వీరందరి నటనకు కూడా భారీగా ప్రశంసలు దక్కుతున్నాయి.  అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా ఒక వ్యక్తికి అసలు నచ్చలేదు.  అయన ఎవరో కాదు 'అ ఆ' సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రమణియన్.  సినిమాటోగ్రాఫర్ కమ్ యాక్టర్ అయిన ఇతను 'సూపర్ డీలక్స్' ఒక చెత్త సినిమా.. భరించలేమని సింపుల్ గా తేల్చేశాడు.  తన ట్విట్టర్ ఖాతా ద్వారా "దుఃఖం .. అసహ్యకరమైన విషయాలను చూసి ఆనందించడం.. మెచ్చుకోవడం ఓకేనా? నేనైతే దూరంగా ఉంటాను.  ఓరి దేవుడా.. సూపర్ డీలక్స్ ను భరించలేం" అంటూ ట్వీట్ చేశాడు.

కానీ 'సూపర్ డీలక్స్' ను ఇలా విమర్శించడంతో నెటిజనులు అయనను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. "ఈ సినిమాకు దూరంగా ఉండు.  నువ్వు ఇప్పుడు చేస్తున్న గొప్ప సినిమాలు చెయ్" అంటూ ఒక నెటిజనుడు చురక అంటించాడు.  అందరూ సూపర్ అనే సినిమాను వేస్ట్ అంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది కదా!
    

Tags:    

Similar News