ఈ మధ్య స్టార్ హీరోలు నటించిన సినిమాల్లో వారి కెరీర్ ని మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ మూవీస్ ని రీ మాస్టర్ చేస్తూ రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల బర్త్ డేలని టార్గెట్ చేసుకుని రిలీజ్ చేస్తున్న సినిమాలు ఇన్నేళ్ల తరువాత కూడా మంచి వసూళ్లని రాబడుతుండటంతో చాలా మంది ఈ తరహా సినిమాలని రీమాస్టర్ చేస్తూ రీ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. ఈ సరికొత్త ట్రెండ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'పోకిరి'తో శ్రీకారం చుట్టారు.
ఆ తరువాత పవన్ కల్యాణ్ జల్సా, ప్రభాస్ వర్షం, రెబల్, బిల్లా.. వంటి సినిమాలు కూడా రీ రిలీజ్ కావడం తెలిసిందే. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన 'చెన్నకేశవరెడ్డి'ని కూడా ఇదే తరహాలో రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రెండ్ నిర్మాతలకు మరోసారి కాసులు కురిపిస్తుండటంతో ఫ్లాప్ సినిమాలని కూడా పనిలో పనిగా లైన్ లో పెడుతూ రీమాస్టర్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ తరహా సినిమాలకు ఫ్యాన్స్ భారీ స్థాయిలో ఎగబడుతుండటంతో ఈ తరమా సినిమాల రీ రిలీజ్ ల పరంపర అప్రతిహతంగా కొనసాగుతోంది.
త్వరలో సూపర్ స్టార్ కృష్ణ నటించి, తెరకెక్కించిన తొలి 70 ఎం, ఎం మూవీ 'సింహాసనం'ని 8కెలో రీమాస్టర్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా వుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సురేష్ కృష్ణ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన మూవీ 'బాబా'. 2002, ఆగస్టు 15న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ మూవీని రీమాస్టర్ చేసి రీ రిలీజ్ చేయబోతున్నారు.
20 ఏళ్ల తరువాత మళ్లీ ఈ మూవీని మరిన్ని ప్రత్యేకతలతో తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన సినిమాలు రీమాస్టర్ చేసి 4కెలో విడుదల చేస్తే 'బాబా'ని మాత్రం అదనపు సీన్స్ ని జోడించి రిలీజ్ చేస్తుండటం విశేషం. తాజాగా ఈ సీన్స్ కి సంబంధించి స్వయంగా రజనీకాంత్ డబ్బింగ్ చెప్పారు. ఇటీవలే అతనపు సీన్స్ కి సంబందించిన డబ్బింగ్ ని సూపర్ స్టార్ రజనీకాంత్ పూర్తి చేయడంతో అందుకు సంబంధించిన స్టిల్ ఒకటి ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతోంది.
భారీ అంచనాల మధ్య 2002లో విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయింది. జీవిత తత్వాన్ని బోధిస్తూ వేదాంత ధోరణికి సమకాలీన రాజకీయాలని జోడించి తెరకెక్కించిన తీరు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 'బాషా' లాంటి గేమ్ ఛేంజర్ మూవీని రజనీకి అందించిన సురేష్ కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించినా ఆ మ్యాజిక్ ని మాత్రం 'బాబా'తో రిపీట్ చేయలేకపోయాడు. సీన్స్ మార్చి రీ రిలీజ్ చేస్తున్న 'బాబా'ని డిసెంబర్ 12న రజనీ పుట్టిన రోజు సందర్భంగా తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.