రజనీకాంత్ సూపర్‌స్టార్ ఎలా అయ్యారు? భారతదేశ సినీచరిత్రలోనే ఆయన మాత్రమే యూనిక్ స్టైల్ తో బాక్సాఫీస్ ని శాసించే స్థాయికి ఎదగడానికి కారణాలేంటి? అంటే ఆయన జీవితానుభవాలు, ఆలోచన ధోరణి కారణమని సన్నిహితులు చెబుతారు. హీరోయిజానికి డ్యాషింగ్ స్టైల్ ని అద్దిన గ్రేట్ స్టార్‌గా తనని తాను ఆవిష్కరించుకున్నారాయన. కండక్టర్ టు సూపర్‌స్టార్ అయిన వైనం అంతే ఛాలెంజింగ్. వయసుతో పాటు అభిమాన ధనాన్ని, సినిమా సినిమాకీ స్టార్‌డమ్‌నీ పెంచుకుంటూ ఎదిగిన హీరో రజినీకాంత్.
రజనీలో ఉన్న కొన్ని బెస్ట్ క్వాలిటీస్ ఆయన్ని ఇంత పెద్దగా ఎదిగేలా చేశాయి. రజినీ క్వాలిటీస్ లో తొలిగా ఆయన ఆధ్యాత్మిక చింతన ఒత్తిళ్లను అధిగమించేందుకు సాయమైంది. భక్తి ఆయనకు నేర్పిన గొప్ప పాఠం ఒకటి ఇలా ఉంది. ఓసారి బెంగళూరులో ఓ దేవాలయానికి వెళ్లాలనుకున్నప్పుడు, జనాలు ఎక్కువగా ఉంటారనీ, వెళ్లడం మంచిది కాదనీ సన్నిహితులు వారించారు. కానీ వాళ్ల మాట వినకుండా ఓ పాత లుంగీ కట్టుకొని, ముడతల పడ్డ చొక్కా వేసుకొని ఓ పేద వృద్ధుడిలా ఆ గుడిలో రజనీ అడుగుపెట్టారు. ఆయన్ని అలా చూసిన ఓ గుజరాతీ మహిళ, బిచ్చగాడు అనుకొని జాలిపడి రజనీ చేతిలో పది రూపాయల నోటు పెట్టి ముందుకెళ్లారు.
రజినీ కూడా వద్దనకుండా ఆ డబ్బులను జేబులో పెట్టుకున్నారు. కాసేపటి తరవాత రజనీ హుండీలో వంద రూపాయలు వేయడం చూసి ఆ మహిళ ఆశ్చర్యపోయారు. గుడిమెట్లు దిగాక ఆయన ఖరీదైన కారెక్కడం చూసి తన తప్పు తెలుసుకున్న మహిళ, దగ్గరికొచ్చి తానిచ్చిన పది రూపాయల్ని తిరిగిచ్చేయమన్నారు. కానీ రజినీ దానికి ఒప్పుకోలేదు. ``ఇలాంటి సందర్భాల్లోనే నేనేంటో నాకు తెలుస్తుంది. నా స్థాయిని గుర్తుచేయడానికి దేవుడే మీతో అలా చేయించారేమో`` అంటూ ఆ మహిళను సముదాయించారు రజినీ. ఆయన నిరాడంబరతనే ఆ తర్వాత స్టైల్‌గా మారింది. దానినే అభిమానులు గొప్పగా కొలుస్తున్నారు. ``ద నేమ్ ఈజ్ రజనీకాంత్`` అనే పుస్తకం (రచయిత్రి గాయత్రీ శ్రీకాంత్)లో ఆయన సూపర్‌స్టార్ గా ఎదగడానికి కారణమైన ఎన్నో విషయాల్ని ప్రస్థావించారు.
రజనీ స్క్రిప్టుల ఎంపిక, సినిమా సినిమాకి ప్రయోగాలు చేసిన విధానం, దర్శకనిర్మాతలు, పంపిణీదారులతో సత్సంబంధాలు, నష్టాలు వచ్చినప్పుడు ఆదుకునే తత్వం, పేదల్ని- కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే మానవత ఇవన్నీ అతడిని సూపర్‌స్టార్ ని చేశాయి. ఇప్పుడు అదే స్ట్రాటజీని పలువురు స్టార్లు అనుసరిస్తున్నారు. ఇండియాలోనే నంబర్- 1 స్టార్ ఎవరు? అంటే అమితాబ్ అంతటి వారే రజనీకాంత్ పేరు చెబుతారు. అంతటి గౌరవాన్ని రజనీ ఆపాదించుకున్నారు. అపూర్వ రారంగల్ మొదలు నేడు 2.0 చిత్రంతో 600కోట్ల క్లబ్ స్టార్ అయ్యాడు రజనీ. ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగాడు. నేడు రజనీ పుట్టిన రోజు సందర్భంగా 2.0 చిత్రాన్ని హైదరాబాద్ లో పిల్లల కోసం స్పెషల్ షోల్ని ఎరేంజ్ చేశారని 2.0 పీఆర్‌వో బీఏ రాజు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.