లీవుడ్ బాద్ షా సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రంగా నిరాశ పర్చుతూ వచ్చాడు. మళ్ళీ తిరిగి పుంజుకునేందుకు షారుఖ్ దాదాపు మూడు సంవత్సరాల బ్రేక్ తీసుకున్నాడు. బ్రేక్ తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను కమిట్ అయ్యాడు. అయిదవ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ విడుదలకు సిద్దం అయ్యింది.. మరో వైపు ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా ను యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో చేసేందుకు షారుఖ్ సిద్దం అవుతున్నాడు.
అట్లీ కుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఇంత బిజీగా ఉన్న షారుఖ్ ఖాన్ తన కూతురు ను కూడా హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ఆమెకు హీరోయిన్ గా నటించాలని ఆసక్తి ఉందని స్వయంగా షారుఖ్ చెప్పుకొచ్చాడు. అందుకు తాను కూడా ఓకే అన్నాను.. తన అభిరుచికి తగ్గట్లుగానే ఆమెను వెళ్లనిచ్చేందుకు తండ్రిగా నిర్ణయం తీసుకున్నాను అన్నట్లుగా షారుఖ్ ఖాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూతురు గురించి చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.
షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే ఇన్ స్టాలో స్టార్ గా మారింది. దాదాపుగా రెండున్నర మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న సుహానా ఖాన్ రెగ్యులర్ గా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ మంచి పాపులారిటీని దక్కించుకుంది. హీరోయిన్స్ రేంజ్ లో ఈ అమ్మడికి దక్కిన గుర్తింపు బాలీవుడ్ లో చర్చనీయాంశం అయ్యింది. హీరోయిన్ కాకుండానే ఇంత హడావుడి చేస్తూ హాట్ ఫోటో షూట్ ను చేస్తున్న సుహానా ఖాన్ హీరోయిన్ అయితే రచ్చ చేయడం ఖాయం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.
2023 సంవత్సరంలో సుహానా ఖాన్ మొదటి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ బాలీవుడ్ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సుహానా ఖాన్ మొదటి సినిమాకు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జోయా అక్తర్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.
జాతీయ మీడియా కథనాల అనుసారం జోయా అక్తర్ ప్రస్తుతం ఒక యంగ్ హీరో తో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా హీరోతో పాటు ఇతర టెక్నీషియన్స్ కూడా జోయా అక్తర్ ఆఫీస్ లో చర్చల్లో ఉన్నారు. ఈ సమయంలోనే సుహానా ఖాన్ కూడా జోయా ఆఫీస్ లో ప్రత్యక్ష్యం అయ్యింది. జోయా ఆఫీస్ లో సుహానా మీడియా కంట పడింది.
దాంతో ఇప్పడు జోయా అక్తర్ ఆఫీస్ లో సుహానాకు ఏం పని అయ్యి ఉంటుంది అంటూ చర్చించుకుంటున్నారు. జోయా తీయబోతున్న సినిమాలో హీరోయిన్ గా సుహానా ను ఎంపిక చేసి ఉంటారు.. అందుకే ఆమె ఈ సినిమా చర్చల్లో పాల్గొంటూ ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు సినిమాలో హీరోయిన్ గా సుహానా ఖాన్ నటిస్తున్నట్లు జోయా అక్తర్ ప్రకటించడం ద్వారా అన్ని విషయాలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కాని డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడం వల్ల ఆయన సినిమా రంగ ప్రవేశం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.