దాదాపు 1600 చిత్రాలకు పైగా పిఆర్వో గా పనిచేసిన స్టార్ పి.ఆర్.ఓ ఆయన. సూపర్ హిట్ మ్యాగజైన్.. ఇండస్ట్రీ హిట్ వెబ్ సైట్ అధినేత.. పాపులర్ సినీజర్నలిస్ట్.. ఆర్ జె సినిమాస్.. సూపర్ హిట్ ఫ్రెండ్స్ బ్యానర్లపై పలు హిట్ చిత్రాలు నిర్మించిన సక్సెస్ ఫుల్ నిర్మాత బి ఏ రాజు మనందరినీ విడిచి భౌతికంగా దూరమయ్యి సంవత్సరం గడిచినా... ఆయన చిరునవ్వు.. స్నేహశీలత... తెలుగు సినీ పరిశ్రమలో.. పాత్రికేయ రంగం మీద ఆయన వేసిన చెరగని ముద్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. పరిశ్రమలో ఎందరో స్టార్ హీరోలకు అగ్ర దర్శకనిర్మాతలకు ఆయన ఎంతో ఆప్తుడు. ఎందరో నవతరం తారలకు బీఏ రాజు - బి.జయ దంపతులు అవకాశాలు కల్పించి గొప్పవారిగా మన్ననలు అందుకున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన బి ఏ రాజు పీఆర్వోగా మ్యాగజైన్ కర్తగా అంచలంచెలుగా ఎదుగుతూ పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో ఆయన తెలియని వారు లేనంతగా అనుబంధాన్ని పెంచుకున్నారు. తన ప్రియ అభిమాని బి.ఏ రాజు గురించి కృష్ణ గారు తన ప్రథమ వర్ధంతి రోజున మరపురాని జ్ఞాపకాలు పంచుకున్నారు... ``బి.ఏ రాజు నా అభిమాని. నేను బెజవాడ ఎప్పుడు వెళ్ళినా నన్ను కలిసేవాడు. ఫ్యాన్ మెయిల్ కి రిప్లై ఇవ్వడానికి నేనే అతన్ని మద్రాస్ తీసుకొచ్చాను. చాలా సంవత్సరాలు ఫ్యాన్ మెయిల్ కి రిప్లై ఇచ్చేవాడు.
నాకు ఫ్యాన్స్ ని ఎక్కువగా డెవలప్ చేశాడు. ఆ తర్వాత నాకు జర్నలిస్ట్ అవ్వాలని ఉందండి.. ఏదన్నా పేపర్ కు రెకమండ్ చేయండి! అని అంటే నేనే జ్యోతిచిత్ర కు సిఫారసు చేశాను. తర్వాత రకరకాల పేపర్ లలో పని చేశాడు. ఇండస్ట్రీలో అందరితో పరిచయాలు పెంచుకుని జర్నలిస్ట్ గా చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సొంతంగా సూపర్ హిట్ పత్రిక పెట్టి ఆ పత్రికను తెలుగు సినిమా పత్రికల్లో నంబర్ 1 పత్రికగా తీర్చిదిద్దాడు. సూపర్ హిట్ పత్రిక ఎంత ఫేమస్ అంటే నేను అమెరికా వెళ్ళినప్పుడు చికాగో లో ఇండియన్ స్ట్రీట్ లో అన్నీ ఇండియన్ షాపులు ఉండేవి.
అందులో పేపర్లు అమ్మే తెలుగు షాపు ఒకటి ఉంది. అందులో ఆదివారం ఎడిషన్ ఈనాడు- సూపర్ హిట్ ఈ రెండే తెలుగు పేపర్లు ఉన్నాయి. అమెరికా లో కూడా పాపులర్ అయ్యేంతగా డెవలప్ చేశాడు సూపర్ హిట్ ని. తర్వాత నిర్మాతగా సినిమాలు కూడా తీశాడు. చాలా అభివృద్ధి లోకి వచ్చి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇంత త్వరగా మనందరినీ విడిచి అతను వెళ్లిపోవడం చాలా బాధాకరం`` అని అన్నారు. కృష్ణ వారసుడు సూపర్ స్టార్ మహేష్ సైతం ఎంతో ఎమోషనల్ గా బీఏ రాజు గారి విషయంలో స్పందించారు.
ఆయన తొలి వర్థంతి రోజున ఘట్టమనేని కుటుంబం ఎంతో ఎమోషనల్ అవ్వడం జర్నలిస్టులలో మరోసారి చర్చకు వచ్చింది. ఇక టాలీవుడ్ లో పీఆర్వో అంటే బి.ఏ రాజు మాత్రమే అని నమ్మేవాళ్లే ఎక్కువ. సీనియర్లు జూనియర్లు కొత్తవాళ్లు పాతవాళ్లు చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే విభేధం లేకుండా అందరు జర్నలిస్టులను ఆదరించిన ఒకే ఒక్క పీఆర్వోగానూ ఆయనకు గౌరవం గుర్తింపు ఎప్పటికీ చెరగనివి.
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు.. హీరో సుధీర్ బాబు గారు కూడా బి ఏ రాజు గారితో ఆయనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ``బి ఏ రాజు గారు నాకు, మా కుటుంబానికి చాలా ఆత్మీయులు. ఆయన నా ఫేవరేట్ పి ఆర్ ఓ. నేను ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో ఎలాంటి సినిమాలు చేయాలి, మంచి టెక్నీషియన్స్ ఎవరు అనే విషయాల మీద ఎన్నో సూచనలు చేసేవారు. ఆయనలో నాకు ఎంతో నచ్చే విషయం ఏంటంటే చిన్న హీరో.. పెద్ద హీరో.. చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే తేడా లేకుండా అందరినీ ఒకేలాగా చక్కని చిరునవ్వుతో పలకరించేవారు.
ఆయన్ని ఆయన చిరునవ్వుని మిస్ అవుతున్నాను. ఎక్కడున్నా ఆయన అదే చిరునవ్వుతో ఉంటారని ఆశిస్తున్నాను`` అన్నారు సుధీర్ బాబు. బి.ఏ రాజు గారి ప్రథమ వర్ధంతిన తెలుగు సినీ ప్రముఖులు- పాత్రికేయ రంగం ఆయన్ని స్మరించుకుంది. ఒక పాత్రికేయుడిగా సినిమా నిఘంటువుగా బి.ఏ రాజును సాటి జర్నలిస్టులు ఎంతో గౌరవిస్తారు. రాజు గారి తొలి వర్ధంతిరోజున ఆయనను సినీ జర్నలిస్టులంతా ప్రత్యేకంగా సంస్మరించుకున్నారు.