మహేశ్ బాబు అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'సర్కారువారి పాట' సినిమా పైనే ఉంది. ఈ నెల 12వ తేదీన రానున్న ఈ సినిమా కోసం వాళ్లంతా వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో మహేశ్ బాబు మాట్లాడుతూ .. "నాన్నగారికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండటం .. చిన్నప్పటి నుంచి నేను సినిమాలు చేయడం .. నాన్నగారి అభిమానులు నన్ను సపోర్ట్ చేయడం .. ఏ జన్మలోనో నేను చేసుకున్న నా అదృష్టం.
అందరూ కూడా నా గ్లామరస్ రహస్యం అడుగుతుంటారు. అలా అడిగినప్పుడు నాకేం చిరాకు అనిపించదు .. వినడానికి చాలా బాగుంటుంది. ఈ సినిమా టైటిల్ ' సర్కారువారి పాట' అనే విషయం ముందుగా లీక్ అయింది .. ఆ తరువాతనే నాకు తెలిసింది.
టైటిల్ ఎలా లీక్ అయిందనేది ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. చాలామంది మేమే కావాలని లీక్ చేశామని అనుకున్నారు. నా సినిమా రిలీజ్ కావడానికి ముందు రోజు రాత్రి నాకు కాస్త టెన్షన్ ఉంటుంది. కానీ ఈ సారి అలాంటి టెన్షన్ లేదు.
ఎందుకంటే ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ .. పాటలకి వచ్చిన రెస్పాన్స్ .. ఎడిటింగ్ రూమ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ .. ఇవన్నీ చూస్తుంటే, ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందనే నమ్మకం ఉంది. ఫస్టాఫ్ లో నాకు .. కీర్తికి సంబంధించిన ట్రాక్ ఒక రేంజ్ లో ఉంటుంది.
ఓ 45 నిమిషాల పాటు థియేటర్ ఊగిపోతుందంతే. నిజంగా నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. నా క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇలాంటి పాత్రను ఇంతవరకూ చేయలేదు. ట్రైలర్ చూసినప్పుడు కూడా అందరూ అలాగే ఫీలయ్యారు.
మహేశ్ బాబును ఈ మధ్య కాలంలో ఇలా చూడలేదని అంతా చెప్పుకున్నారు. ఆ కొత్తదనానికి అంతా కూడా కనెక్ట్ అయ్యారు. ఆ క్రెడిట్ అంతా కూడా పరశురామ్ కే దక్కుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం పరశురామ్ చాలా మంది పేర్లు చెప్పాడు. అప్పుడు నేను సముద్రఖని పేరును సూచించాను. ఆయన అయితే కరెక్టుగా ఉంటుందని అన్నాను. నిజంగానే ఆయన ఆ పాత్రను అద్భుతంగా చేశాడు. ఆయన ఈ సినిమాకి ప్లస్ అయ్యాడు. ఈ సినిమాలో నేను చాలా స్పెట్స్ వాడతాను. 'ఒక కళ్లజోడు ఇవ్వండి ఫ్రేమ్ కట్టుకుని పెట్టుకుంటాను' అని షూటింగు చివరి రోజున సముద్రఖని అడిగారు. ఆయన పెర్ఫార్మెన్స్ చూసిన తరువాత ఆయనకి కళ్లజోళ్ల కొట్టే కొనిపించాలని అనిపించింది " అంటూ నవ్వేశారు.