సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో దాదాపు పుష్కర కాలం తరువాత ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ ప్రకటించి నెలలు గడుస్తున్నా.. లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరిపి రెండు నెలలు గడుస్తున్నా ఎంతకీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదంటూ మహేష్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఎట్టకేలకు మహేష్, త్రవిక్రమ్ ల #SSMB28 సోమవారం 12న ఫైనల్ గా పట్టాలెక్కింది.
ముందు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించాలనుకున్నా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫార్మల్ గా ప్రారంభించి ఆ తరువాత రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లోకి మార్చాలని ప్లాన్ చేసుకన్నారు. అనుకున్న ప్రకారమే మూడు రోజుల పాటు అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ చేసి ప్రస్తుతం చిత్ర బృందం రామోజీ ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ అయిపోయింది. ఆదివారం నుంచి కీలక ఘట్టాల షూటింగ్ ని మొదలు పెట్టనుందట.
దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. గత సినిమాలకు పూర్తి భిన్నంగా భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారు. అంతే కాకుండా ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ కు `కేజీఎఫ్` ఫైట్ మాస్టర్స్ అన్బు అరివు కంపోజ్ చేస్తున్నారట. గత కొన్ని రోజులుగా బస్ నేపథ్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది.
ఈ యాక్షన్ ఎపిసోడ్ విషయంలో సూపర్ స్టార్ మహేష్ చాలా హ్యాపీగా, సూపర్ స్టార్ సూపర్ ఎక్సైటెడ్ గా వున్నారట. యాక్షన్ ఎపిసోడ్ ని ఫైట్ మాస్టర్స్ అన్బు అరివు డిజైన్ చేసిన తీరు, త్రివిక్రమ్ విజన్ కి మహేష్ ఫుల్ హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోయారట. రామోజీ ఫిల్మ్ సిటీలో మరి కొన్ని రోజులు షూటింగ్ చేసి మళ్లీ బ్రేక్ ఇస్తారట. ఆ తరువాత మళ్లీ మొదలు పెడతారని తెలిసింది.
ఇదిలా వుంటే బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. పీఎస్ వినోద్ సినిమాఫొటోగ్రఫీ, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ ఏ.ఎస్ ప్రకాష్. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 2023 సమ్మర్ ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.