సూపర్‌ స్టార్‌ సినిమా జపాన్‌ లో కుమ్మేస్తోందట

Update: 2021-07-19 23:30 GMT
ఈమద్య కాలంలో ఇండియన్ సినిమాలు విదేశీ భాషల్లో విడుదల అవ్వడం కామన్ అయ్యింది. కాని రెండు దశాబ్దాల క్రితమే రజినీకాంత్‌ నటించిన కొన్ని సినిమాలు జపాన్ తో సహా పలు దేశాల్లో ఆయా దేశాల స్థానిక భాషల్లో డబ్బింగ్ అయ్యి విడుదల అయ్యేవి. రజినీకాంత్ కు జపాన్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉండేది. ఇప్పటికి ఆ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందని మరోసారి నిరూపితం అయ్యింది. రజినీకాంత్‌ నటించిన దర్బార్‌ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాను ఇప్పుడు జపాన్ లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. స్థానిక భాషలో స్ట్రీనింగ్‌ అవుతున్న దర్బార్‌ ను చూసేందుకు పెద్ద ఎత్తున జపనీస్ ఆసక్తి చూపిస్తున్నారు.

తమిళ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం జపాన్ ఎంకేసీ ప్లెక్స్ లో ఇటీవల విడుదల అయిన దర్బార్‌ సినిమాకు మంచి స్పందన వచ్చిందట. హౌస్‌ ఫుల్‌ కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకు పోతుందని.. ఇప్పటికి కూడా జపనీస్ అభిమానులు రజినీకాంత్‌ సినిమా అంటే తెగ చూసేస్తున్నారు అంటూ జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఈనెల 21 వరకు ఈ సినిమా బుకింగ్‌ జరిగాయి. జపనీస్ లో రజినీకాంత్‌ అంటే ఉన్న అభిమానం నేపథ్యంలో అక్కడ దర్బార్‌ ను విడుదల చేసినట్లుగా చెప్పిన మేకర్స్‌ మరిన్ని స్క్రీన్స్ లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. గత ఏడాదిలోనే ఎందుకు ఈ సినిమాను అక్కడ విడుదల చేయలేదు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జపాన్‌ లో మన సూపర్‌ స్టార్ సందడి చేస్తుండటం ప్రతి ఒక్క సినీ ప్రియుడు గర్వించదగ్గ విషయం.

ఇక రజినీకాంత్ తాజాగా అన్నాత్తే సినిమా షూటింగ్‌ ను ముగించాడు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్నాత్తేలో రజినీకాంత్‌ కు జోడీగా నయనతార నటించిందని ఇంకా కీర్తి సురేష్‌ పలువురు స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారని తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా కాస్త బ్రేక్ తీసుకుని మళ్లీ కొత్త సినిమాను మొదలు పెట్టేందుకు రజినీకాంత్‌ సిద్దం అవుతున్నాడు. ఈసారి తన కూతురు దర్శకత్వంలో ఆయన సినిమా ఉంటుందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Tags:    

Similar News