దక్షిణ భారత చలనచిత్ర కార్మికుల సంఘాల సమాఖ్య (ఫెప్సీ) - తమిళ నిర్మాతల మండలి మధ్య వేతనాల పెంపుపై విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెప్సీ సభ్యులు సమ్మెకు దిగడంతో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాతో పాటు 20 సినిమాల షూటింగ్ లు నిలిచిపోయాయి. కొన్ని చిత్రాల షూటింగ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై రజనీకాంత్ స్పందించారు. ఇరు వర్గాలు చర్చించుకోవాలని సమస్యను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తనకు నచ్చని కొన్ని మాట్లల్లో సమ్మె ఒకటని, సమస్య ఏదైనా ఇగోలను పక్కనబెట్టి ప్రజల బాగు గురించి ఆలోచించాలని రజనీ అన్నారు. చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనగలమని అభిప్రాయపడ్డారు. సీనియర్ నటుడిగా నిర్మాతల మండలి - ఫెప్సీకి విజ్ఞప్తి చేస్తున్నానని, ఇరు వర్గాల వారు మాట్లాడుకుని ఈ సమస్యకు ఓ మంచి పరిష్కారం కనుగొనాలని సూచించారు.
కొందరు ఫెప్సీ వర్కర్స్ ఇష్టారీతిన రెమ్యునరేషన్స్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని నిర్మాతల మండలి పేర్కొంది. కార్మికుల జీతాలను పెంచాలన్న తమ డిమాండ్ నెరవేర్చాలని ఫెప్సీ అధ్యక్షుడు ఆర్ కే సెల్వమణి అన్నారు. ఈ సమ్మె ప్రభావంతో రజనీకాంత్ ‘కాలా’ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ సినిమా కోసం చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ముంబై నుంచి కొత్త బృందాన్ని తెప్పించే పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.