రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఆ విషయమై చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. అసలు మోహన్ లాల్ ఈ సినిమాలో నటించబోతున్నాడా లేదా అనే విషయంపై క్లారిటీ రాకుండానే మరో వార్త సినీ ప్రేమికులకు సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తోంది.
చారిత్రక ఆధారాల ప్రకారం కొమురం భీంలో పోరాట స్ఫూర్తిని కలిగించింది ఆయన బాబాయి. భీం లో ఉద్యమ నాయకుడి లక్షణాలు పెంపొందించింది ఆయన బాబాయి అవ్వడం వల్ల సినిమాలో ఆ పాత్రను కీలకంగా దర్శకుడు రాజమౌళి చూపించాలని భావిస్తున్నాడట. అందుకే ఆ పాత్ర కోసం సూపర్ స్టార్ మోహన్ లాల్ ను ఎంపిక చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్.. మోహన్ లాల్ లు కలిసి జనతా గ్యారేజ్ చిత్రం లో నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పుడు మరోసారి ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యం లో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ కు జోడీగా ఇంగ్లీష్ నటి ఓలివియా నటిస్తోంది. లాక్ డౌన్ పీరియడ్ పూర్తి అయిన వెంటనే మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టేందుకు జక్కన్న రెడీగా ఉన్నాడని సమాచారం అందుతోంది.