కరోనా కారణంగా స్టార్స్ బయటకు వెళ్లడమే మానేశారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అనే భయంతో పలువురు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. ఈ అయిదు నెలల కాలంలో చాలా మంది స్టార్స్ ఒకటి రెండు సార్లు బయటకు వెళ్లి ఉంటారు. బంధువులు స్నేహితుల ఇళ్లకు వెళ్లి ఉంటారు. కాని పార్టీలు పబ్ లు వేడుకలకు మాత్రం హాజరు అయ్యింది లేదు. అయితే మలయాళ సూపర్ స్టార్ మమ్ముటీ కనీసం తన సన్నిహితుల ఇంటికి కూడా ఈ అయిదు నెలల కాలంలో వెళ్లలేదట.
మమ్ముటీ తనయుడు దుల్కర్ సల్మాన్ తాజాగా లైవ్ చాట్ లో మాట్లాడుతూ తన తండ్రి గత 150 రోజులుగా బయటకు వెళ్లలేదు. తనకు తానే ఛాలెంజ్ చేసుకుని ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన మరి కొంత కాలం కూడా పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అదే మంచి నిర్ణయం అనుకుంటున్నాను. ఒక వ్యక్తి పూర్తిగా ఇంటికే అన్ని రోజులు పరిమితం అవ్వడం అంటే మామూలు విషయం కాదు.
అది కాకుండా ఒక సూపర్ స్టార్ ఎప్పుడు బిజీగా ఉండే వ్యక్తి ఇంట్లోనే కూర్చుని టైం పాస్ చేయాలంటే కష్టంతో కూడుకున్న పని. కాని కరోనా ఆ పనిని మమ్ముటీతో చేయించింది. మమ్ముటీ మలయాళంలో వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఆయన తనయుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి మలయాళంతో పాటు తెలుగు మరియు తమిళంలో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.