#MB ఫ‌ర్ సేవింగ్ హార్ట్స్.. మ‌రో చిన్నారి గుండె ప‌దిలం

Update: 2021-03-09 07:30 GMT
స్టార్ హీరోల సేవాగుణం అన్నివేళ‌లా ప్ర‌శంస‌నీయం. సౌత్ లో అన్ని ప‌రిశ్ర‌మల్లోనూ అగ్ర‌తార‌లు త‌మ‌వంతు సామాజిక ధృక్ప‌థాన్ని విడిచిపెట్ట‌కుండా సామాజిక సేవకు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ లో అగ్ర హీరోల సేవాగుణం నిరంత‌రం చ‌ర్చ‌కు వ‌స్తోంది.  

అయితే ఇత‌రుల‌తో పోలిస్తే సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఎంపిక చేసుకున్న ఆప్ష‌న్ ఎంతో వైవిధ్య‌మైన‌ది. పుట్టుక‌తోనే చాలా మంది చిన్నారులు గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్న వైనం మ‌హేష్-న‌మ్ర‌త బృందాన్ని తీవ్రంగా క‌లిచి వేసింద‌ని ఆ క్ర‌మంలోనే ఈ జంట తీసుకున్న నిర్ణ‌యం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతోంద‌ని ఇంత‌కుముందే క‌థ‌నాలొచ్చాయి. తాజాగా మ‌రో కొన‌సాగింపు క‌థ‌నం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

ఓ ప్ర‌యివేట్ ఆస్ప‌త్రి‌తో క‌లిసి చిన్నారులకు గుండె ఆప‌రేష‌న్లకు మ‌హేష్ సాయం చేస్తున్నారు. ఇప్ప‌టికే వంద‌లాది చిన్నారుల‌కు గుండె స‌ర్జ‌రీల‌కు ఆర్థిక‌సాయం చేశారు. తాజాగా మ‌రో ఆప‌రేష‌న్ విజ‌య‌వంత‌మైంది. బాధిత కుటుంబీకుల క‌ళ్ల‌లో ఆనందానికి సంబంధించిన ఓ ఫోటోని నమ్ర‌త తాజాగా ఇన్ స్టాలో షేర్ చేశారు.

``మ‌రో చిన్నారి స‌మ‌స్య నుంచి రిక‌వ‌రీ అయ్యారు. అంకిత్ భార్గ‌వి VSD & PDA (గుండె సంబంధ‌) స‌ర్జ‌రీ విజ‌య‌వంతం అయ్యింది. ఆ చిన్నారి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నాను.. #MB ఫ‌ర్ సేవింగ్ హార్ట్స్`` అంటూ హృద‌యం ఈమోజీని న‌మ్ర‌త షేర్ చేశారు. శ‌భాష్.. ఈ సేవ‌లు ఇలానే కొన‌సాగించండి అంటూ అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News