తమిళ స్టార్ హీరో ప్రభు నట వారసుడు విక్రమ్ ప్రభు సరసన నటించింది సురభి. ఒక ప్రముఖ తెలుగు- తమిళ నటి కుమార్తె ఈ అమ్మడు. కథానాయిక రాధ ఇన్ స్పిరేషన్ తో సినిమాల్లోకి వచ్చానని చెప్పింది. చూడటానికి చబ్బీగా కనిపించిన ఈ అమ్మడికి కెరీర్ ఆరంభమే నేచురల్ స్టార్ నాని - శర్వానంద్ లాంటి యంగ్ స్టర్స్ సరసన అవకాశం దక్కింది. కానీ ఎందుకనో తెలుగులో పెద్దగా కెరీర్ పరంగా వెలగలేకపోయింది.
2013లో `ఇవన్ వేరమాతిరి` అనే తమిళ చిత్రంతో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన సురభి అటుపై ధనుష్ సరసన `వేళైఇల్ల పట్టాధారి` (రఘువరన్ బిటెక్) చిత్రంలో నటించింది. ఉత్తమ నటిగా సైమా అవార్డును గెలుచుకుంది. తెలుగులో సందీప్ కిషన్ సరసన బీరువా - శర్వానంద్ సరసన `ఎక్స్ ప్రెస్ రాజా` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ క్రమంలోనే స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ తెరకెక్కించిన `వల్లి` చిత్రంలోనూ నటించి ఆకట్టుకుంది. ఈ భామ ఆ తర్వాత నాని సరసన `జెంటిల్ మేన్` చిత్రంలోనూ ఆడిపాడింది. కానీ ఎందుకనో కెరీర్ పరంగా ఆశించిన స్థాయి బ్రేక్ రాలేదు.
టాలీవుడ్ - కోలీవుడ్ లో సురభికి పెద్ద స్థాయి అవాకాశాలేవీ రాలేదు. అయినా ఈ యంగ్ బ్యూటీ బ్రాండ్ ప్రమోషన్స్ లో మాత్రం దూసుకుపోతోంది. తాజాగా హైదరాబాద్ హైటెక్ సిటీ- కొత్తగూడ పరిసరాల్లో స్వదేశ్ మల్టీ కుజన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసింది ఈ అమ్మడు. స్వదేశ్‌కి ప్రమోటర్ గా ఏడాది పాటు కాంట్రాక్టు కుదుర్చుకుందిట. ఈ సందర్భం గా అసలు ఒక్కో బ్రాండ్ ప్రచారానికి - రిబ్బను కటింగులకు సురభి ఎంత డిమాండ్ చేస్తోంది? అని ప్రశ్నిస్తే.. 20-50లక్షల వరకూ ఆర్జిస్తోందని తెలుస్తోంది. సైడ్ ఇన్ కం ఆ రేంజులో ఉంటుంది కాబట్టే గ్లామర్ & గ్లిడ్జ్ పరిశ్రమను ఎవరూ విడిచిపెట్టరు అన్న మాటా వినిపించింది. సురభి తదుపరి ఓ తెలుగు సినిమాకి సంతకం చేసిందని, త్వరలోనే వివరాలు వెల్లడి కానున్నాయని తెలుస్తోంది.