పాలబుగ్గల పిల్ల గ్లామర్ డోస్ పెంచితే పండగే!

Update: 2021-03-14 04:30 GMT
అందంగా ఉంటే హీరోయిన్ అయిపోవచ్చనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. అందం అవకాశం తెచ్చిపెడుతుంది .. అభినయం దానిని నిలబెడుతుంది .. ప్రేక్షకుల అభిమానం దానిని కాపాడుతుంది. తెలుగు తెరను పలకరించిన అందగత్తెల్లో స్టార్ డమ్ ను అందుకున్న వాళ్లు చాలా తక్కువమందే. మిగతా వాళ్లంతా వెనకబడిపోయారు .. వేరే భాషలను వెతుక్కుంటూ వెళ్లిపోయారు. ఇక లాభం లేదనుకున్న వాళ్లు ఇళ్లకే వెళ్లిపోయారు. అందం ఉన్నా .. అభినయం తెలిసినా వాళ్లు వెనక్కివెళ్లి పోవడానికి కారణం లౌక్యం తెలియకపోవడమే.  

అవును .. ఎక్కడ నెగ్గుకురావాలన్నా కావలసింది లౌక్యమే. ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య గట్టిపోటీ ఉంటుంది. ఒక అవకాశం వెతుక్కుంటూ రావడం ఎంత కష్టమో, వచ్చిన ఛాన్స్ చేజారిపోవడం అంత తేలిక. అందువల్లనే ఇక్కడ ఎక్కువ పరిచయాలు ఉండాలి .. ఆ పరిచయాలను అవకాశాలుగా మార్చుకునే లౌక్యం ఉండాలి. చాలామంది ఇక్కడే దెబ్బతింటూ ఉంటారు. ఇక లౌక్యం వలన అవకాశాలు వస్తాయిగానీ .. విజయాలు రావు గనుక కొంత అదృష్టం కూడా ఉండాలి. అలా లౌక్యం తెలియని పిల్లగా .. అదృష్టం పాళ్లు తగ్గిన పిల్లగా సురభి కనిపిస్తూ ఉంటుంది.

చేపల్లా మెరిసే కళ్లతో .. మొగ్గలన్నీ ఒక్కసారిగా విరిసినట్టుగా కనిపించే బుగ్గలతో .. పట్టుతేనెను దాచుకున్న పెదాలతో ఈ పిల్ల కుదురుగా .. కుందనపుబొమ్మలా కనిపిస్తుంది. 'బీరువా' సినిమాతో పరిచయమైన ఈ పిల్లను చూసినవాళ్లు, తెరపై పాలకోవాను పండించారేమో అనుకున్నారు. ఆ తరువాత మరో రెండు హిట్లు పడినా, స్పీడ్ మాత్రం పెగలేదు. అందంతో పాటు అమాయకత్వం కూడా ఈ పిల్లకి కాస్త ఎక్కువేనేమో అనిపిస్తోంది. ఆమె తాజా చిత్రంగా చేసిన 'శశి' ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది.

ఈ సందర్భంగా సురభి ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఈ అమ్మాయి మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది .. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా నా కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. కొన్ని కారణాల వలన తెలుగులో గ్యాప్ వస్తోంది. ఇకపై అలా రాకుండా చూసుకుంటాను. ఇక పై మరింత గ్లామరస్ గా ఉండే పాత్రలను ఎక్కువగా చేయాలనుకుంటున్నాను. అలాంటి పాత్రలు వస్తాయనే ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. ఈ పిల్ల గ్లామర్ డోస్ పెంచడమంటే వరుస పండుగలన్నీ ఒక్కసారిగా వచ్చేసినట్టు ఉండదూ!     
Tags:    

Similar News