ఫోటో స్టోరీ: హాటు భామ బ్యాక్ మ్యాజిక్

Update: 2020-03-08 17:30 GMT
తమిళ సినిమాలతో హీరోయిన్ గా కెరీర్ ఆరంభించి తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భామ సురభి పురానిక్.  తెలుగులో 'బీరువా'.. 'ఎక్స్ ప్రెస్ రాజా'.. 'ఎటాక్'.. 'ఒక్క క్షణం'.. 'ఓటర్' లాంటి సినిమాల్లో నటించింది. ఈ ఢిల్లీ భామ ఇతర న్యూ జెనరేషన్ భామల తరహాలోనే యమా ఫాస్టు. అందుకే ఇన్స్టా గ్రామ ప్రజలను మురిపించేందుకు రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది.

తాజాగా ఈ సురభి క్యాప్షన్ ఏమీ ఇవ్వకుండానే ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలో ఒక టేబుల్ పై కూర్చుని వెనక్కు తిరిగి అందంగా ఓ చిరునవ్వు రువ్వింది. స్లీవ్ లెస్ టాప్ ధరించి.. పైన ధరించాల్సిన డెనిమ్ జాకెట్ ను పక్కనే టేబుల్ పైన పెట్టుకుంది.. దీంతో ఫోటోకు ఓ హాట్ అప్పీల్ వచ్చేసింది.  బ్లాక్ & వైట్ ఫోటో కావడంతో కళాత్మకంగా డబ్బూ రత్నాని క్యాలెండర్ ను గుర్తుకుతెస్తోంది.  ఈతరం భామలు ఎక్కువమంది జీరో సైజ్ లో ఉంటారు.. కానీ సురభి మాత్రం అలా కరువుప్రాంతవాసిలాగా లేనే లేదు. ముద్దుగా బొద్దుగా కనిపిస్తోంది.

ఈ ఫోటోకు నెటిజన్లు చాలామంది జేజేలు పలికారు.  'సెక్సీ.. సూపర్ హాట్'.. "ఫ్లాష్ బ్యాక్ ఈజ్ కూల్".. "క్యూట్ స్మైల్" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. సురభి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'శశి'.. 'భీమవరం' అనే సినిమాల్లో నటిస్తోంది.


Tags:    

Similar News