అల్లు హీరోతో ఢిల్లీ బేబీ

Update: 2017-03-15 08:16 GMT
అల్లు శిరీష్ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చేశాడు. శ్రీరస్తు శుభమస్తుతో సక్సెస్ సాధించి ట్రాక్ లోకి వచ్చేసిన ఈ అల్లు హీరో.. ఆ వెంటనే తెలుగు సినిమా మొదలుపెట్టకుండా.. మలయాళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆశ్చర్యపరిచాడు. మోహన్ లాల్ తో కలిసి 1971:బెయాండ్ బోర్డర్స్ చిత్రంలో నటించగా.. ఏప్రిల్ 7న ఈ చిత్రం తెలుగులో 1971.. భారత సరిహద్దు అనే టైటిల్ పై విడుదల కానుంది.

ఇప్పుడు శిరీష్ తన తర్వాతి సినిమా కన్ఫాం చేసేశాడు. రీసెంట్ గా నిఖిల్ తో కలిసి ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ బ్లాక్ బస్టర్ సాధించిన దర్శకుడు వీఐ ఆనంద్ తో తన మరుసటి చిత్రం చేయనున్నాడు శిరీష్. సైంటిఫిక్ ఫిక్షన్ కోణంలో తెరకెక్కనుండగా.. ఇందులో హీరోయిన్ గా ఢిల్లీ బేబీ సురభిని ఫైనల్ చేశారు. శర్వానంద్ తో ఎక్స్ ప్రెస్ రాజా.. నానితో జెంటిల్మన్ వంటి సినిమాల్లో నటించిన సురభి.. ఇప్పుడు సక్సెస్ జోష్ లోనే ఉంది.

ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు చాలానే స్కోప్ ఉంటుందిట. అందుకే దర్శకుడు స్టోరీ చెప్పగానే.. తన సమ్మతి చెప్పేసిందట సురభి. సైంటిఫిక్ మూవీలో భాగం కావడం.. మెగా హీరోతో జోడీ కట్టడంపై తెగ ఉత్సాహంగా ఉంది సురభి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News