ఫొటోటాక్‌ : సురేఖ వాణి మీ వయసు తగ్గుతూ వస్తుందా?

Update: 2020-07-20 10:10 GMT
గత కొన్ని వారాలుగా తెలుగు క్యారెక్టర్‌ ఆర్టిస్టులు అయిన సురేఖ వాణి మరియు ప్రగతిల ఫొటోలు మరియు వీడియోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. వీరు హీరోలకు హీరోయిన్స్‌ కు అమ్మగా అత్తగా ఆంటీగా నటించి మెప్పించారు. ఈమద్య కాలంలో కాస్త వీరి జోరు తగ్గింది. హీరోయిన్స్‌ అమ్మ పాత్రలకు ఓకే చెబుతున్న నేపథ్యంలో వీరిని కాస్త సైడ్‌ కు పెట్టారు. చిన్న సినిమాల్లో మాత్రమే ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తమ సత్తా ఏంటో చూపించేందుకు వీరు సోషల్‌ మీడియాను ఆశ్రయించారు.

వీరిద్దరు కూడా సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా పోస్ట్‌ లు పెడుతున్నారు. సినిమాలో అమ్మగా అత్తగా కనిపించిన వీరు సోషల్‌ మీడియా పోస్ట్‌ ల్లో మాత్రం చాలా రొమాంటిక్‌ గా హాట్‌ గా కనిపిస్తున్నారు. కూతురుతో కలిసి సురేఖ వాణి పెడుతున్న పోస్ట్‌ లు నెట్టింట రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే సురేఖ వాణిని మీరు అమ్మగా కాదు మీ పాపకు అక్కగా ఉన్నారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా మరో ఫొటోతో సురేఖ వాణి నెటిజన్స్‌ ముందుకు వచ్చింది.

ఈ ఫొటోలు తీక్షణంగా ఏదో ఆలోచిస్తు ఉన్నట్లుగా ఈమె కనిపిస్తుంది. ఫొటో చాలా హాట్‌ గా ఉండటంతో పాటు ఆమె వయసు మరింతగా తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఈసారి మీ పాపకు అక్కగా కాదు మీ పాపలాగే మీరు కనిపిస్తున్నారు అంటున్నారు. కొందరు అందరి వయసు పెరుగుతూ ముసలి వాళ్లు అయ్యి అందం తగ్గుతూ ఉంటుంది. కాని మీ అందం మాత్రం రోజు రోజుకు పెరుగుతుందని మీ అందంకు కారణం ఏంటీ.. మీ వయసు తగ్గడంకు కారణం ఏంటీ అంటూ నెటిజన్స్‌ పోస్ట్‌ కు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ లాక్‌ డౌన్‌ పీరియడ్‌ లో సురేఖ వాణి మరింత సన్నగా మారినట్లుగా అనిపిస్తుంది.
Tags:    

Similar News