పవన్ కు వదినమ్మ స్పెషల్ ఇన్విటేషన్

Update: 2017-01-04 16:34 GMT
పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వస్తాడా రాడా? అడగడానికి తేలికే గానీ.. చెప్పడానికి ఆన్సర్ చాలా కష్టం. మెగాస్టార్ కంబ్యాక్ మూవీ కావడం.. 9 ఏళ్ల తర్వాత చిరు స్క్రీన్ పై కనిపించనుండడంతో.. మెగా ఫ్యామిలీ అంతా ఈ వేడుకలో వేదికపై కనిపించాలని ఆ కుటుంబంతోపాటు.. ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

అయితే.. పవన్ తన పర్సనల్ కారణాల దృష్ట్యా ఈ ఫంక్షన్ కు రావడం లేదని అల్లు అరవింద్ ఓ మారు చెప్పేశారు. ఆ తర్వాతి రోజు రామ్ చరణ్ మాట్లాడుతూ.. అందరితోపాటు బాబాయ్ పవన్ కళ్యాణ్ ను కూడా ఆహ్వానించడం నా బాధ్యత అని.. రావడం రాకపోవడం ఆయన ఇష్టం అని అనడంతో.. ఇంకా పవర్ స్టార్ హాజరుపై సందేహాలు తొలగలేదనే విషయం అర్ధమైంది. ఇప్పుడు అన్నయ్య భార్య సురేఖ తన కన్నతల్లితో సమానం అని పలు మార్లు పవన్ స్వయంగా చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది.

పవన్ రాకపోవడాన్ని ఆమె మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే ఆమె స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మరి కొణిదెల సురేఖ ఆహ్వానాన్ని అయినా పవన్ కళ్యాణ్ మన్నించి ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరవుతాడా లేదా అనే ఆసక్తి నెలకొంది.
Tags:    

Similar News